జొహాన్నెస్‌బర్గ్: భారత మహిళల క్రికెట్ జట్టు..దక్షిణాఫ్రికా పర్యటన ఖరారైంది. ఈ ఏడాది ఆఖర్లో టీమ్ఇండియా..సఫారీలతో ఏకైక టెస్టుతో పాటు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
డిసెంబర్ 9 నుంచి 15వ తేదీ వరకు పొచెఫ్‌స్ట్రూమ్, బ్లూమ్ఫౌంటేన్, కేప్‌టౌన్ వేదికలుగా వన్డేలు జరుగనున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు ఇరు జట్ల మధ్య జెబెర్హాలో టెస్టు పోరు సాగనుంది. ఇరు దేశాల మధ్య ఇది నాలుగో టెస్టు మ్యాచ్ కానుంది.