లండన్: ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు భారత జట్టు తమలో తాము ఆడిన ఇంట్రా స్కాడ్ మ్యాచ్ను మూడు రోజుల్లో ముగించింది. కెంట్ వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్లో భారత ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ (122 నాటౌట్)తో పాటు ఇంగ్లండ్తో జట్టుకు ఎంపిక కాని సర్ఫరాజ్ ఖాన్ (101) శతకాలతో మెరిశారు.
చాలాకాలంగా జట్టుకు దూరమైన శార్దూల్.. ఇటీవలే ఇంగ్లండ్ ‘ఏ’తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లోనూ ఫర్వాలేదనిపించగా తాజాగా సెంచరీతో కదంతొక్కడంతో అతడు ఈ నెల 20 నుంచి లీడ్స్ వేదికగా మొదలుకాబోయే తొలి టెస్టులో చోటు దక్కించుకునే అవకాశాలను మెరుగుపరుచుకున్నాడు.