చెన్నై: స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ తమిళనాడు (ఎస్‌డీఏటీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కాష్ వరల్డ్ కప్‌లో భారత జట్టు క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. చెన్నైలోని ఎక్స్‌ప్రెస్ అవెన్యూ మాల్లో జరుగుతున్న ఈ టోర్నీలో భారత జట్టు.. పూల్ ‘బీ’లో 3-0 (7-5, 7-2, 7-2)తో బ్రెజిల్‌ను చిత్తుచేసింది.
నేషనల్ చాంపియన్ వెలవన్ సెంథిల్‌కుమార్, యువ సంచలనం అన్హ త్ సింగ్‌తో పాటు అభయ్ సింగ్ వరుస విజయాలతో బ్రెజిల్‌ను చిత్తుచేశారు. శుక్రవారం జరుగబోయే క్వార్టర్స్‌లో భారత్.. దక్షిణాఫ్రికాతో ఆడుతుంది.