కొలంబో: భారత్‌తో ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన పాకిస్థాన్ బ్యాటర్ సిద్ర అమిన్‌ను ఐసీసీ మందలించింది. మ్యాచ్‌లో ఒంటరిపోరాటం చేసిన ఆమె.. 81 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినా స్నేహ్ రాణా బౌలింగ్‌లో ఔట్ అయిన వెంటనే పిచ్‌ను బ్యాట్‌తో బలంగా కొట్టింది.
ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినందుకు గాను ఐసీసీ ఆమెకు ఒక డీమెరిట్ పాయింట్‌తో పాటు మందలించి వదిలేసింది.