అహ్మదాబాద్ : వచ్చే యేడాది జనవరి 13-ఫిబ్రవరి 4 తేదీల మధ్య శ్రీలంకలో నిర్వహించాల్సిన అండర్-19 పురుషుల ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికాకు తరలించాలని ఐసీసీ నిర్ణయించింది.
శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం విధించిన 11 రోజులకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ అజమాయిషీ పెరిగిన నేపథ్యంలో ఐసీసీ శ్రీలంక క్రికెట్ బోర్డును నిషేధించిన విషయం తెలిసిందే.