మెడ ముట్టుకుంటే.. తొడగొట్టినట్టే..
‘పవర్‌స్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా పాట ఉండాలని.. దానికి ఆస్కార్ పెన్నే కరెక్ట్ అని చంద్రబోస్‌ని కలిశాను. పవన్‌కల్యాణ్‌పై అభిమానంతో.. ఆయన జీవన శైలిపై అవగాహనతో.. పవన్‌కల్యాణ్‌కి మాత్రమే సెట్ అయ్యేలా చంద్రబోస్ ఈ పాట రాశారు. ‘మెత్తని మట్టిలో మొలిసిన మొలకవు కాదోయ్ నువ్వు.. బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవు నువ్వు..’ అనేది ఈ పాటలో నాకిష్టమైన లైన్.
‘పవర్‌స్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా పాట ఉండాలని.. దానికి ఆస్కార్ పెన్నే కరెక్ట్ అని చంద్రబోస్‌ని కలిశాను. పవన్‌కల్యాణ్‌పై అభిమానంతో.. ఆయన జీవన శైలిపై అవగాహనతో.. పవన్‌కల్యాణ్‌కి మాత్రమే సెట్ అయ్యేలా చంద్రబోస్ ఈ పాట రాశారు. ‘మెత్తని మట్టిలో మొలిసిన మొలకవు కాదోయ్ నువ్వు.. బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవు నువ్వు..’ అనేది ఈ పాటలో నాకిష్టమైన లైన్. యేటికి ఎదురీదడం అంటే ఎప్పుడూ పవన్‌కల్యాణ్ ముందుంటారు. ఆయన ప్రయాణమంతా ఈ పాటలో ఉండేలా ప్రయత్నించాం. ఈ పాటకోసం దేవిశ్రీ, చంద్రబోస్ ప్రాణం పెట్టారు. పవన్ స్వాగ్, పవన్ పవర్ ఈ సినిమాలో చూస్తారు’ అని హరీశ్‌శంకర్ అన్నారు. ఆయన దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’.
శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలు. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠంలో ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌ని విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు హరీశ్‌శంకర్ పై విధంగా స్పందించారు. పవన్‌కల్యాణ్ కెరీర్లో నిలిచిపోయేలా ఈ పాట ఉంటుందని, పవర్‌స్టార్ సినిమాకు సంగీతం అందించడంలో ఓ కిక్ ఉంటుందని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అన్నారు. ‘మెడ ముట్టుకుంటే.. తొడగొట్టినట్టే.. జుట్టెగురుతుంటే.. ఇక దడదడ పిడుగులు పడినట్టే.. ’ అంటూ సాగే ఈ పాట పవన్‌కల్యాణ్ వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేసేలా సాగింది. ఇంకా ఈ కార్యక్రమంలో గీత రచయిత చంద్రబోస్, దర్శకుడు దశరథ్ కూడా పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

