Radha Yadav | వడోదర: గుజరాత్లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి జనజీవనం అతలాకుతలమవుతోంది. భారత మహిళల క్రికెట్ జట్టు ప్లేయర్, లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్ రాధా యాదవ్ సైతం వరదలో చిక్కుకుంది.
వడోదరలోని సొంత నివాసంలో ఉండగా అక్కడి ప్రాంతాలను వరద ముంచెత్తడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) సాయంతో రాధాతో పాటు అక్కడి జనం వరద ప్రమాదం నుంచి బయటపడ్డారు.