గాలె: శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. లంకేయులను 305 పరుగులకు ఆలౌట్ చేసిన కివీస్.. మొదటి ఇన్నింగ్స్లో 340 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన లంక..
మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 237 పరుగులు సాధించింది. కరుణరత్నె (83), చండిమాల్ (61) రాణించారు. మాథ్యూస్ (34 నాటౌట్), డి సిల్వ (34 నాటౌట్) క్రీజులో ఉన్నారు. లంక ప్రస్తుతం 202 పరుగుల ఆధిక్యంలో ఉంది.