ముంబై : భారత్ మరో ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు జరుగబోయే ఫిడే ప్రపంచకప్ భారత్లో జరుగనుంది.
ఈ మెగా టోర్నీని గోవాలో నిర్వహించనున్నట్టు ఫిడే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 8 రౌండ్లుగా సాగే ఈ టోర్నీలో సుమారు 90 దేశాల నుంచి 206 మంది ప్లేయర్లు పాల్గొననున్నారు.