న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్ వైట్‌వాష్‌కు గురికావడంపై బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. సొంతగడ్డపై ఎప్పుడూ లేని రీతిలో తొలిసారి సిరీస్ క్లీన్‌స్వీప్ ఎదుర్కొవడాన్ని బోర్డు సిరీయస్‌గా తీసుకుంది. ఇందులో భాగంగా అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా..టీమ్ఇండియా చీఫ్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్‌శర్మ, చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌తో శుక్రవారం ఏకంగా ఆరు గంటల పాటు సమావేశమైంది.
కివీస్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలపై బోర్డు పెద్దలు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ భేటీకి కోచ్ గంభీర్ ఆన్లైన్ ద్వారా హాజరయ్యాడు. ముంబైలో జరిగిన మూడో టెస్టులో బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో పాటు స్పిన్ వికెట్‌ను ఎందుకు ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. కీలకమైన ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు జట్టు తిరిగి ఎలా గాడిలో పడుతుందన్న దానిపై వివరణ అడిగినట్లు సమాచారం.