కొత్తపల్లి, డిసెంబర్ 27: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. హైదరాబాద్ కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేదర్ స్టేడియంలో నిర్వహిస్తున్న పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. పురుషుల విభాగంలో కరీంనగర్, సూర్యాపేట, కొత్తగూడెం, జనగాం, నారాయణపేట్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, హన్మకొండ, గద్వాల్, సంగారెడ్డి, సిరిసిల్ల, నాగర్ కర్నూల్, హైదరాబాద్, వనపర్తి జట్లు ప్రీ క్వార్టర్‌కు చేరాయి. ఈ జట్ల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లను ఆదివారం ఉదయం నిర్వహించనున్నారు.
మహిళల క్యాటగిరీలో కరీంనగర్, సూర్యాపేట, నల్గొండ, మేడ్చల్, హైదరాబాద్, మహబూబాబాద్, వరంగల్, వనపర్తి, నిజామాబాద్, గద్వాల్, రంగారెడ్డి, సిద్ధిపేట, మహబూబ్‌నగర్, జనగాం, జగిత్యాల, ఖమ్మం జట్లు ప్రీ క్వార్టర్‌కు చేరాయి. కాగా, శనివారం రాత్రి నల్గొండ, హైదరాబాద్, వరంగల్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. నేడు (ఆదివారం) సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.