హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్లో క్రీడలకు తగిన ప్రాధాన్యం దక్కింది. శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఓవైపు స్పోర్ట్స్ స్కూల్స్ అభివృద్ధికి తోడు అకాడమీల ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు.
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్)కు రూ.500 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం యువజన సర్వీసులకు రూ.146 కోట్లు కేటాయింపులు చేసింది. గతేడాది క్రీడలకు రూ.426 కోట్లు కాగా, ఈసారి రూ.220 కోట్లు అదనంగా ఇచ్చినట్లు సాట్స్ వర్గాలు పేర్కొన్నాయి.