హనుమకొండ, మార్చి 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్ స్పోర్ట్స్ స్కూల్లో గత ఏడాది 50 మంది అడ్మిషన్లు పొందారు. టీచింగ్, ట్రైనింగ్ లేకపోవడంతో వీరిలోనూ ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 80 మంది బాలబాలికలకు ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. జిల్లా స్థాయి స్పోర్ట్స్ సూల్స్ సెలెక్షన్స్ ప్రక్రియను ఈనెల 30, 31న జేఎన్ఎస్లో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎలాంటి వసతులు లేని వరంగల్ స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్లు ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్పోర్ట్స్ స్కూళ్లలో బాలబాలికలకు వేర్వేరుగా బ్లాక్‌లు, కోచ్‌లు, స్టాఫ్ క్వార్టర్లు, అధునాతనమైన కిచెన్, డైనింగ్‌హాల్, క్రీడల్లో మెళకువలు తెలుసుకునేందుకు ఆడియో లైబ్రరీ.. జాతీయ, అంతర్జాతీయ క్రీడా నిపుణులతో ఆన్లైన్ క్లాసులు నిర్వహణకు డిజిటల్ తరగతులు ఉండాలి. స్పోర్ట్స్ స్కూల్లోని విద్యార్థుల క్రీడా నైపుణ్యాలను గుర్తించే ట్రాక్ రికార్డుల నిర్వహణ వ్యవస్థ ఉంటుంది. మోటివేషన్‌పై ప్రధానంగా దృష్టి సారిస్తారు. వరంగల్ స్పోర్ట్స్ స్కూల్లో వీటిలో ఒక్క వసతి లేదని, నామమాత్రంగానే ఈ స్కూల్ ఉందని క్రీడా నిఫుణులు వాపోతున్నారు.