బెంగళూరు: హైదరాబాద్ స్టార్ క్రికెటర్ ఠాకూర్ తిలక్‌వర్మ..దులీప్ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో నిలకడగా రాణిస్తున్న తిలక్‌వర్మ..వచ్చే నెలలో జరుగనున్న దులీప్ట్రోఫీలో సౌత్‌జోన్ టీమ్‌కు నాయకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం కౌంటీల్లో హంప్‌షైర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్ నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా 100, 56, 47, 112 పరుగులతో దుమ్మురేపుతున్నాడు.
తిలక్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న సెలెక్టర్లు కెప్టెన్‌గా అవకాశం కల్పించారు. హైదరాబాద్ నుంచి తిలక్‌తో పాటు తన్మయ్ అగర్వాల్ చోటు దక్కించుకున్నాడు. గత రంజీ సీజన్లో నిలకడగా రాణించిన నలుగురు కేరళ క్రికెటర్లు అజారుద్దీన్, నిదీశ్, బాసిల్, సల్మాన్ నిజార్..16 మందితో కూడిన సౌత్‌జోన్ జట్టుకు ఎంపికయ్యారు.