Badminton | బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. బ్యాంకాక్ వేదికగా శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో భారత జోడీ 21-17, 21-14 తేడాతో మలేషియా ద్వయం జునైది అరిఫ్-రాయ్ కింగ్ యప్‌ను 38 నిమిషాల్లోనే మట్టికరిపించి సెమీస్‌కు చేరుకుంది.
మహిళల డబుల్స్‌లో అశ్విని-తనీషా జంట 21-15, 21-23, 21-19 తేడాతో కొరియన్ ద్వయం షిన్ సెయుంగ్ చన్-లి యు లిమ్‌ను ఓడించింది. సంచలన ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ ఆటగాడు మిరాబా లువాంగ్ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. క్వార్టర్స్‌లో లువాంగ్ 12-21, 5-21తో కున్లావత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో పరాభవం పాలయ్యాడు.