మొదలైంది.. టీజీ20 సందడి.. తొలి పోరులో ఖమ్మం ఏసెస్ గెలుపు
తెలంగాణ క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఐపీఎల్ తరహాలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ఆదివారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఐపీఎల్ తరహాలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ఆదివారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో ఖమ్మం ఏసెస్ జట్టు 20 పరుగుల తేడాతో పాలమూరు స్ట్రైకర్స్ టీమ్ను ఓడించి శుభారంభం చేసింది. తొలుత ఖమ్మం 20 ఓవర్లలో 237/5 స్కోరు చేయగా.. ఛేదనలో పాలమూరు ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 217పరుగులే చేయగలిగింది.
అంతకుముందు జరిగిన ప్రారంభ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరవగా.. లీగ్ బ్రాండ్ అంబాసిడర్, హీరో విజయ్ దేరకొండ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సందడి చేశారు. టీజీ20 బీసీసీఐ అనుమతించిన అధికారిక లీగ్ అని.. ఇందులో ఆటగాళ్లు , ఫ్రాంచైజీలకు ఎలాంటి సందేహం అవసరం లేదని బోర్డు అపెక్స్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వర్ నాథ్ పేర్కొన్నారు. టోర్నీలో వరంగల్ వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత క్రికెటర్ సిరాజ్ మాట్లాడుతూ.. ఇది అందరికీ చాలా పెద్ద ప్లాట్ఫామ్ అన్నాడు. ఆ తర్వాత తమన్ ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

