Aryna Sabalenka : బెలారస్ టెన్నిస్ సుందరి అరీనా సబలెంక(Aryna Sabalenka) గ్రాండ్‌స్లామ్ విజేతగా ఈ ఏడాదిని ముగించింది. రెండో సీడ్ అయిన సబలెంక యూఎస్ ఓపెన్ (US Open 2024) టైటిల్ విజయాన్ని సరికొత్తగా ఆస్వాదిస్తోంది. టెన్నిస్‌కు కొన్ని రోజులు హాలీ డే ప్రకటించిన ఈ బ్యూటీ ప్రియుడితో కలిసి విహార యాత్రలో సేదతీరుతోంది. అక్కడ ప్రకృతి ఒడిలో, సముద్రపు అలల జడిలో మైమరిచిపోతోంది.
అంతేకాదండోయ్.. ఆకుపచ్చని బికనీ ధరించిన ఆమె సూర్యాస్తమయంతో పాటు కడలి కెరటాల అందాల్ని ఆస్వాదిస్తోంది. ఈ సందర్భంగా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫొటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతలో పోస్ట్ చేసింది. ఇంతకు సబలెంక ప్రియుడు ఎవరో తెలుసా..? బ్రెజిల్ వ్యాపారవేత్త అయిన గార్జియస్ ఫ్రాంగులిస్(Georgios Frangulis). అతడొక హాకీ ప్లేయర్ కూడా. ఆటల మీదున్న ప్రేమ కాస్త వీళ్లను దగ్గర చేసింది. సబలెంక, ఫ్రాంగులిస్లు 2024 ఏప్రిల్ నుంచి డేటింగ్ చేస్తున్నారు. సబలెంకకు ఇప్పుడు అతడు బాయ్‌ఫ్రెండ్ మాత్రమే కాదు బెస్ట్ ఫ్రెండ్ కూడా.
టెన్నిస్ మ్యాచ్‌ల కోసం ఆమె ఎక్కడకు వెళ్లినా ఫ్రాంగులిస్ విజిటర్స్ గ్యాలరీలో వాలిపోతాడు. ఈమధ్యే ముగిసిన యూఎస్ ఓపెన్ టోర్నీలో సబలెంక రఫ్ఫాడించింది. ఫైనల్లో జెస్సికా పెగులాను 7-5, 7-5తో చిత్తు చేసి గ్రాండ్‌స్లామ్‌ను ముద్దాడింది. ఇది ఆమెకు మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. నిరుడు, ఈ ఏడాది వరుసగా రెండు పర్యాయాలు ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే.