Stock Market Close | ఆల్‌టైమ్ హైకి స్టాక్ మార్కెట్లు.. 84వేల పాయింట్లకు చేరువైన సెన్సెక్స్..
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సరికొత్త గరిష్ఠాలను తాకాయి. వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించాలని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఫెడ్ నిర్ణయం నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు భారీగా పెరిగాయి.
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సరికొత్త గరిష్ఠాలను తాకాయి. వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించాలని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఫెడ్ నిర్ణయం నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు భారీగా పెరిగాయి. ప్రారంభంలో 30 షేర్ల సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా పెరిగింది. మరో వైపు నిఫ్టీ సైతం తొలిసారిగా 25,500 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 83,359.17 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. అదే ఊపును కొనసాగిస్తూ సెన్సెక్స్ 83,773.61 పాయింట్లకు చేరి ఆల్‌టైమ్ హైకి చేరుకున్నది. అయితే, మధ్యాహ్నం వరకు స్వల్పంగా తగ్గింది.
చివరకు 236.57 పాయింట్ల లాభంతో 83,184.80 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 25,487.05 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. తొలి సెషన్లోనే 25,611.95 పాయింట్ల రికార్డు స్థాయికి చేరింది. చివరకు 38.25 పాయింట్ల లాభంతో 25,415.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, టైటాన్ కంపెనీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. బీపీసీఎల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి. ఆటో, బ్యాంక్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం పెరిగాయి. క్యాపిటల్ గూడ్స్, ఐటీ, ఫార్మా, ఆయిల్, గ్యాస్, మీడియా, మెటల్, టెలికాం 0.5-3.5 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం, స్మాల్‌క్యాప్ సూచీలు ఒకశాతం వరకు తగ్గాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

