Team India | న్యూఢిల్లీ: భారత్ టీ20 జట్టులోకి తెలుగు యువ క్రికెటర్ నితీశ్‌కుమార్‌రెడ్డి దూసుకొచ్చాడు. గత ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరుపులు మెరిపించిన నితీశ్‌కు సీనియర్ సెలెక్టర్లు మరోమారు అవకాశమిచ్చారు. బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం శనివారం ఎంపిక చేసిన టీమ్ఇండియాలో నితీశ్ చోటు దక్కించుకున్నాడు. వాస్తవానికి టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే జరిగిన జింబాబ్వే పర్యటనకు నితీశ్ ఎంపికైనా..గాయం కారణంగా దూరం కావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే సూర్యకుమార్‌యాదవ్ నేతృత్వంలో బరిలోకి దిగనున్న భారత జట్టులోకి ఐపీఎల్ యువ సంచలనం, యూపీ స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ బెర్తు దక్కించుకున్నాడు.
ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున ఆడిన మయాంక్ నిలకడగా గంటకు 150కి.మీల వేగంతో బంతులు వేసి ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. అయితే లీగ్ మధ్యలోనే మయాంక్‌కు గాయం కావడంతో జాతీయ జట్టుకు ఎంపిక కాలేకపోయాడు. ఇన్ని రోజులు జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందిన మయాంక్ సెలెక్టర్ల నమ్మకాన్ని చూరగొన్నాడు. అభిషేక్‌శర్మ, రింకూసింగ్, రియాన్ పరాగ్, శివమ్‌దూబే, సుందర్, బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్శర్మ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా బంగ్లాతో భారత్ తలపడనుంది.
జట్టు వివరాలు: సూర్యకుమార్‌యాదవ్(కెప్టెన్), అభిషేక్, శాంసన్, రింకూసింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్‌కుమార్‌రెడ్డి, శివమ్‌దూబే, సు టందర్, బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్శర్మ, అర్ష్‌దీప్‌సింగ్, హర్షిత్రానా, మయాంక్ యాదవ్.