పినపాక, జనవరి 8 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో మౌరి టెక్, కంది చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-17 జాతీయస్థాయి కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల రెండో రోజు గురువారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ టీమ్ 46-40 పాయింట్ల తేడాతో తమిళనాడుపై అద్భుత విజయం సాధించింది.
మిగతా మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్ 50-40తో పంజాబ్‌పై, విద్యాభారతి 55-40తో కేవీఎస్‌పై, ఒడిశా 52-43తో చండీగఢ్‌పై, ఆంధ్రప్రదేశ్ 70-43తో త్రిపురపై, పుదుచ్చేరి 60-46తో సీఐఎస్ఈపై విజయం సాధించాయి. అలాగే కర్ణాటక 40-35తో ఢిల్లీపై, మహారాష్ట్ర 41-34తో హిమాచల్‌ప్రదేశ్‌పై, రాజస్థాన్ 34-22తో ఉత్తరాఖండ్‌పై, హర్యానా 71-25తో కేవీఎస్‌పై గెలిచాయి.