హైదరాబాద్, ఆట ప్రతినిధి: గయా(బీహార్) వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ యువ జిమ్నాస్ట్ నిశిక అగర్వాల్ స్వర్ణ పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన మహిళల అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వ్యక్తిగత ఆల్‌రౌండ్ ఫైనల్లో నిశిక 44.33 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అద్భుత ప్రదర్శన కనబరుస్తూ నిశిక సత్తాచాటింది. ఇదే విభాగంలో అనౌశ్క పాటిల్ (42.06), సారా రవూల్ (41.23) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
బాలుర యూత్ 89కిలోల కేటగిరీలో బరిలోకి దిగిన తెలంగాణ యువ లిఫ్టర్ సాయివర్ధన్ పసిడి పతకంతో మెరిశాడు. స్నాచ్‌లో 120 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 155కిలోలతో మొత్తం 275కిలోలు ఎత్తిన సాయివర్ధన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే విభాగంలో చెంచు వెంకటేశ్(272కి, ఏపీ), రోహన్‌కుమార్ మహతో(266కి, జార్ఖండ్) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.