హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 29 : డిసెంబర్లో దుబాయ్ ఆతిథ్యమివ్వనున్న పారా ఆసియన్ గేమ్స్ 2025 కోసం జరిగిన ఇండియన్ తైక్వాండో ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్‌లో తెలంగాణ పారా తైక్వాండో అథ్లెట్లు మరోసారి సత్తాచాటారు.
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో 27-28 మధ్య జరిగిన పోటీల్లో వరంగల్ నర్సంపేటకు చెందిన అకుల లోకేష్ అండర్-80కిలోల విభాగంలో 2వ స్థానం నిలిచి ఆసియన్ గేమ్స్‌కు ఎంపిక కాగా, మహబూబ్‌నగర్‌కు చెందిన లింగప్ప అండర్-58 కిలోల విభాగంలో 3వ స్థానం సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ ఇద్దరూ తెలంగాణ పారా తైక్వాండో అసోసియేషన్ తరఫున కోచ్ ఎల్లావుల గణేశ్‌యాదవ్ మార్గదర్శకత్వంలో పాల్గొన్నారు.