మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 01, 2020 , 23:38:04

జయేశ్‌, జితేందర్‌రెడ్డికి చుక్కెదురు

 జయేశ్‌, జితేందర్‌రెడ్డికి చుక్కెదురు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌(టీవోఏ) ఎన్నికలు ఊహించని మలుపు తిరిగాయి. శనివారం ఒలింపిక్‌ భవన్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జస్టిస్‌ చంద్ర కుమార్‌ నేతృత్వంలో నామినేషన్ల స్క్రూటిని పూర్తయ్యింది. అనంతరం ఆమోదం పొందిన అభ్యర్థుల జాబితాను సాయంత్రం విడుదల చేశారు. ఇందులో అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, ప్రొఫెసర్‌ కే  రంగారావు ఆమోదం పొందారు. దీంతో ఆయన ఏకగ్రీవ ఎన్నికకు దాదాపు మార్గం సుగమమైందని చెప్పొచ్చు. నామినేషన్‌ తిరస్కరణ విషయంలో జయేశ్‌ వర్గం కోర్టును ఆశ్రయించబోతున్నట్లు తెలిసింది. టీవోఏ ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలపై ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు పేర్కొన్నారు.  


logo
>>>>>>