హైదరాబాద్, ఆట ప్రతినిధి: గువాహటి వేదికగా జరిగిన జాతీయ కరాటే చాంపియన్షిప్లో తెలంగాణ కరాటే ప్లేయర్లు సత్తాచాటారు. ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు జరిగిన టోర్నీలో తెలంగాణ టీమ్ మొత్తం 34 పతకాలు సొంతం చేసుకుంది.
ఇందులో 12 స్వర్ణాలు సహా 13 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. తెలంగాణ ప్లేయర్లు కాటా, కుమిటే వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. అండర్-10, 12, 14, 18 వయసు విభాగాల్లో యువ ప్లేయర్లు ప్రతిభ చాటగా, సీనియర్లు ఆకట్టుకున్నారు.