పూణె: టీమ్ఇండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో హ్యాట్రిక్ పడగొట్టాడు. సూపర్ లీగ్ గ్రూప్-ఏలో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. ఆంధ్రా నిర్దేశించిన 113 పరుగుల ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చిన మధ్యప్రదేశ్.. నితీశ్ వేసిన 3వ ఓవర్లో హర్ష్ గవ్లి, హర్‌ప్రీత్ బ్రర్, రజత్ పాటిదార్ వికెట్లను కోల్పోయింది. 3 ఓవర్లలో నితీశ్.. 17 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసినా ఆంధ్రాకు ఓటమి తప్పలేదు.