Virat Kohli | న్యూఢిల్లీ: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదని వెల్లడించాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి ఉప్పల్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. ఆదివారం కోహ్లీ తన నిర్ణయం తెలిపాడు. వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్లో మొదటి రెండు మ్యాచ్లు ఆడలేనని బోర్డుకు నివేదించాడు.
తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తుండగా.. వచ్చే నెల 2 నుంచి విశాఖపట్నంలో రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ రెండు మ్యాచ్లకోసం సెలెక్షన్ కమిటీ ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ‘కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్మెంట్, సెలెక్టర్లతో కోహ్లీ మాట్లాడాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం తన తొలి ప్రాధాన్యమే అయినా.. వ్యక్తిగత తప్పని పరిస్థితుల కారణంగా.. రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండనని వెల్లడించాడు.
విరాట్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. 2021లో ఆస్ట్రేలియాతో సిరీస్ సమయంలోనూ కోహ్లీ ఇలాగే పితృత్వ సెలవులు తీసుకోగా.. మళ్లీ ఇప్పుడు విరాట్ సతీమణి విరుష్క రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో అతడు బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేదెవరో సెలెక్షన్ కమిటీ ఇంకా వెల్లడించలేదు. సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ జట్టులో చోటు ఆశిస్తున్నారు.