చండీగఢ్: టీమ్ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్.. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ హెడ్ ఆఫ్ క్రికెట్‌గా ఎంపికయ్యాడు. గతంలో పంజాబ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించిన సంజయ్.. దాదాపు పదేండ్ల తర్వాత తిరిగి పంజాబ్‌తో కలిసి పనిచేయనున్నాడు.
‘మరోసారి పంజాబ్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. కింగ్స్‌తో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. మంచి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. వారికి అవసరమైన సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’ అని బంగర్ ఒక ప్రకటనలో తెలిపాడు. ప్రస్తుతం పంజాబ్ జట్టుకు ట్రావర్ బేలీస్ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. గత రెండు సీజన్లలోనూ పంజాబ్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.