అహ్మదాబాద్: భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ దీప్తిశర్మ (41, 1/35) ఆల్‌రౌండ్ షోతో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన మొదటి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 44.3 ఓవర్లలో 227 పరుగులు చేసింది.
తేజల్ హసబ్నిస్ (42), దీప్తి, యస్తికా భాటియా (37) రాణించారు. అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ అమ్మాయిలు 40.4 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలారు. స్పిన్నర్ రాధా యాదవ్ (3/35), అరంగేట్ర పేసర్ సైమా ఠాకూర్ (2/26) కివీస్‌ను దెబ్బకొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.