IND vs BAN : టీ20 వరల్డ్ కప్‌లో అదరగొడుతున్న భారత జట్టు (Team India) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. సెమీస్ బెర్తుకు అడుగు దూరంలో ఉన్న టీమిండియా సూపర్ 8 రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ (Bangladesh)తో తలపడనుంది. అంటిగ్వా వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో అయినా టీమిండియా బ్యాటింగ్ యూనిట్లో మార్పులు చేస్తుందా? సంజూ శాంసన్ (Sanju Samson)కు చాన్స్ వచ్చేనా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఐపీఎల్లో చితక్కొట్టిన శివం దూబే (Shivam Dube) ఐసీసీ టోర్నీలో స్లో పిచ్‌లపై తేలిపోతున్నాడు.
ఫినిషర్‌గా జట్టులోకి ఈ లెఫ్ట్ హ్యాండర్ వరుసగా 0 నాటౌట్, 3, 31, 10 పరుగులు చేశాడు. వరుసగా విఫలమవుతున్న అతడి స్థానంలో శాంసన్‌ను ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు. వరల్డ్ కప్ వామప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఓపెనర్‌గా సంజూను దింపారు. కానీ.. అందివచ్చిన అవకాశాన్ని వృథా చేసుకుంటూ సున్నాకే వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే.. ఇప్పుడు దూబే వైఫల్యం సంజూకు ప్లస్ కానుంది.
శివం దూబే

మరోవైపు .. ఓపెన్‌గా విరాట్ కోహ్లీ సైతం భారీ స్కోర్ చేయట్లే. రోహిత్ శర్మకు జతగా ఇన్నింగ్స ఆరంభిస్తున్న విరాట్ లీగ్ దశలో 1,4, 0 పరుగులతో నిరాశపరిచినా.. సూపర్ 8 ఫైట్‌లో అఫ్గనిస్థాన్‌పై పర్వాలేదనిపించాడు. 24 పరుగులతో టచ్‌లోకి వచ్చినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. దాంతో, కోహ్లీని అతడికి అనువైన మూడో స్థానంలో ఆడించి.. యువకెరటం యశస్వీ జైస్వాల్‌కు చాన్స్ ఇవ్వాలని మాజీలు అభిప్రాయపడుతున్నారు.

ఇక బౌలింగ్ యూనిట్లో బుమ్రా సహా అర్ష్‌దీప్, అక్షర్ పటేల్‌లు అద్భుతంగా రాణిస్తున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఎంట్రీ ఇచ్చిన కుల్దీప్ యాదవ్ సైతం అఫ్గన్‌పై చెలరేగాడు. దాంతో, బంగ్లాపై ఇదే కాంబినేషన్‌ను కొనసాగిస్తారా? లేదా? ఆసక్తికరం.

సూపర్ 8 తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడింది. వర్షం అంతరాయం కలిగించిన పోరులో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 28 పరుగుల తేడాతో చతికిలపడింది. అయితే.. షొరిఫుల్ ఇస్లాం, రిషద్ హొసెన్, తస్కిన్ అహ్మద్, షకీబుల్ హసన్‌లతో బంగ్లా బౌలింగ్ బలంగా కనిపిస్తున్నా.. బ్యాటింగ్ యూనిట్ సమిష్టిగా ఆడింది లేదు. యంగ్‌స్టర్ తౌహిద్ హృదోయ్, మహ్మదుల్లాలు మాత్రమే బ్యాట్ ఝులిపిస్తున్నారు. బలమైన టీమిండియాను ఓడించాలంటే బంగ్లా ఆల్‌రౌండ్ షో చేయాల్సిందే.
