BCCI : ఇటీవలే విశ్వ విజేతగా అవతరించిన భారత జట్టు (Team India) తొలి సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. స్వదేశంలోనే ప్రపంచకప్‌ను సగర్వంగా ముద్దాడిన టీమిండియా ఉపఖండ జట్టు శ్రీలంక(Srilanka)ను ఢీకొట్టనుంది. డిసెంబర్లో ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. దాంతో.. శుక్రవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఐదు మ్యాచ్‌లకు రెండు నగరాలను మాత్రమే ఎంపిక చేసింది బీసీసీఐ.
వరల్డ్ కప్ తర్వాత కో హోస్ట్‌లు భారత్, శ్రీలంక తలపడుతున్న తొలి సిరీస్ ఇదే. డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 30 వరకూ జరుగబోయే ఐదు టీ20ల సిరీస్‌లో ఇరుజట్లు ఢీకొననున్నాయి. ఈ ఐదు మ్యాచ్‌లకు వైజాగ్, త్రివేండ్రం(తిరువనంతపురం) వేదిక కానున్నాయి. టీమిండియా ఈ ఏడాది జూన్‌లో చివరి పొట్టి సిరీస్ ఆడింది. అది కూడా ఇంగ్లండ్‌లో 3-2తో విజేతగా నిలిచింది హర్మన్‌ప్రీత్ సేన. లంక విషయానికొస్తే ఆ జట్టు మార్చిలో న్యూజిలాండ్‌తో ఆడిన సిరీసే ఆఖరు. ఆ సిరీస్‌ను ఇరుజట్లు 1-1తో సమం చేసుకున్నాయి.
🚨 News 🚨
Schedule for @IDFCFIRSTBank T20I series against Sri Lanka Women announced.
Details ▶️ https://t.co/jYCdTE8YhA#TeamIndia | #WomenInBlue | #INDvSL pic.twitter.com/wK4d5c0XLQ
— BCCI Women (@BCCIWomen) November 28, 2025
తొలి టీ20 – డిసెంబర్ 21 ఆదివారం, విశాఖపట్టణం
రెండో టీ20 – డిసెంబర్ 23 మంగళవారం, విశాఖపట్టణం
మూడో టీ20 – డిసెంబర్ 26 శుక్రవారం, తిరువనంతపురం
నాలుగో టీ20 – డిసెంబర్ 28 ఆదివారం, తిరువనంతపురం
ఐదో టీ20 – డిసెంబర్ 30, మంగళవారం, తిరువనంతపురం