Womens World Cup : పుష్కరకాలం తర్వాత సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్. అన్నీ తెలిసిన మైదానాలే కావడంతో ఎక్కడ ఎలా ఆడాలి? ఏ పిచ్ ఎలా వ్యవహరిస్తుంది?.. వంటివి భారత జట్టుకు కొట్టినపిండి. కో -హోస్ట్ శ్రీలంకలోనూ వాతావరణం దాదాపు ఇలానే ఉంటుంది. ఇంకేముంది ఈసారి కప్ మనదే అనుకున్నారంతా. ఫేవరెట్ ట్యాగ్‌తో బరిలోకి దిగిన టీమిండియా.. వరుసగా రెండు విజయాలతో ఆ దిశగానే సాగింది. కానీ, అభిమానుల ఆనందాన్ని ఆవిరి చేస్తూ వరుసగా రెండు ఓటములు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సేన అనూహ్యంగా మూడు వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఫలితం.. సెమీస్ అవకాశాలు సన్నగిల్లే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కౌర్ సేనకు ఇక ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. మరి.. టీమిండియా పుంజుకోవాలంలటే కొన్ని సవాళ్లను, సమస్యలను అధిగమించాల్సి ఉంది.
ప్రపంచ కప్‌లో ఒకసారి ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు.. ఈసారి ట్రోఫీ వేటలో అదరగొట్టాలనుకుంది. పదమూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ట్రోఫీని ఒడిసిపట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి రెండు మ్యాచుల్లో శ్రీలంక, పాకిస్థాన్‌ను ఓడించి ఫేవరెట్ అనిపించుకుంది. కానీ, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా రూపంలో అసలైన సవాల్ ఎదురైంది. చివరిదాకా పోరాడి ఓడిపోయింది.
📸 📸
Smiles and celebrations all around! 😊
A massive win in Colombo and #TeamIndia have sealed victory no. 2⃣ in #CWC25 🔝👏
Scorecard ▶ https://t.co/9BNvQl3J59#WomenInBlue pic.twitter.com/LlIeJiGrgX
— BCCI Women (@BCCIWomen) October 5, 2025
కానీ.. ఈ రెండు మ్యాచుల్లోనూ బౌలింగ్, ఫీల్డింగ్ కాస్త మెరుగ్గా చేసి ఉంటే టీమిండియానే గెలిచేది. తర్వాతి గేమ్. అక్టోబర్ 19న హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న ఇంగ్లండ్ (England)ను ఢీకొట్టనుంది భారత్. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే హర్మన్‌ప్రీత్ సేన సెమీస్ రేసులో ఉంటుంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్‌కు చెక్ పెట్టాలంటే.. టీమిండియా స్టార్లు చెలరేగిపోవాలి. బౌలింగ్, ఫీల్డింగ్ కూడా ఓ రేంజ్లో ఉండాలి. లేదంటే.. ట్రోఫీపై ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు.
ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతున్నది రీచా ఘోష్ మాత్రమే. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైనా ఆమె నేనున్నాంటూ.. తనదైన విధ్వంసక షాట్లతో విరుచుకుపడుతూ.. జట్టును ఆదుకుంటోంది. గత నాలుగు మ్యాచుల్లోనూ రీచా మెరుపులతోనే భారత్ పోరాడగలిగే స్కోర్లు చేసింది. పాకిస్థాన్‌పై స్మృతి మంధాన (Smriti Mandhana), ప్రతీకా రావల్(Pratika Rawal) నిరాశపరిచినా.. హర్లీన్ డియోల్, రీచా ఘోష్(Richa Ghosh) మెరుపులతో మోస్తరు స్కోర్ చేసింది. ఆస్ట్రేలియాపై దూకుడుగా ఆడి ఓపెనర్లు శుభారంభం ఇచ్చినా.. మిడిలార్డర్ వైఫల్యంతో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 350 కొట్టలేకపోయింది భారత్.
మూడో స్థానంలో హర్లీన్ డియోల్ ఫర్వలేదనిపిస్తున్నా .. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన హర్మన్‌ప్రీత్ కౌర్ పేలవ షాట్లతో వికెట్ పారేసుకుంటోంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఓపికగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించాల్సిన కౌర్ నాలుగు మ్యాచుల్లో 21, 19, 9, 22 రన్స్ చేసిందంతే. సీనియర్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) సైతం ఘోరంగా విఫలమవుతోంది. ఈ మెగా టోర్నీలో ఆసీస్‌పై 33 రన్స్ ఆమె అత్యధిక స్కోర్. తొలిపోరులో శ్రీలంకపై అర్ధ శతకంతో చెలరేగిన దీప్తి శర్మ, అమన్‌జోత్ ఆ తర్వాత స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.
Australia win the match by 3 wickets.#TeamIndia fought spiritedly and will look to bounce back in the next match.
Scorecard ▶ https://t.co/VP5FlL2S6Y#WomenInBlue | #CWC25 | #INDvAUS pic.twitter.com/dc473c4dDW
— BCCI Women (@BCCIWomen) October 12, 2025
ఫలితంగా.. కంగారూలపై 36 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయంది భారత్. తదుపరి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో గెలవాలంటే బ్యాటింగ్ యూనిట్ రాణించడంతో పాటు ఫీల్డింగ్ పొరపాట్లను సరిదిద్దుకోవాలి. బౌలింగ్‌లో క్రాంతి గౌడ్(Kranti Gaud)తో పోటీగా అమన్‌జోత్.. దీప్తి, స్నేహ్ రానాలు వికెట్లు తీయాల్సి ఉంది. ముఖ్యంగా ఈ మెగా టోర్నీలో ఒక్క పెద్ద ఇన్నింగ్స్ ఆడని జెమీమా బ్యాట్ ఝులిపించాల్సి ఉంది. బౌలింగ్‌లో అదరగొడుతున్న తెలుగమ్మాయి శ్రీచరణి (Sree Charani) బ్యాట్‌తో కొన్ని పరుగులైనా చేయాల్సి ఉంది. రీచాకు సాయంగా లోయర్ ఆర్డర్ కూడా ఓ చేయి వేస్తే ప్రత్యర్ధికి మరింత లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశముంటుంది. లేదంటే.. రాబోయే మ్యాచుల్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌పై విజయం అంత తేలిక కాదన్నది సుస్పష్టం.
Next stop ⏭️ Indore 📍
🎥 All smiles and good vibes as #TeamIndia travel for their next challenge in #CWC25 ✈️
Get your tickets 🎟️ now: https://t.co/vGzkkgwXt4
#WomenInBlue | #INDvENG pic.twitter.com/Ghf3B7XxkX
— BCCI Women (@BCCIWomen) October 14, 2025
ప్రపంచ కప్ ఆరంభ పోరులో టాపార్డర్ విఫలమైనా.. శ్రీలంక బౌలర్లను కాచుకొన్న దీప్తి శర్మ (53), అమన్‌జోత్ కౌర్(57)లు దూకుడుగా ఆడి జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు. అనంతరం బంతితోనూ సత్త చాటిన దీప్తి టీమిండియా బోణీ కొట్టడంలో కీలక పాత్ర పోషించింది. కొలంబోలో పాకిస్థాన్‌పై ఓపెనర్లు స్మృతి మంధానా, ప్రతీకా రావల్ తొలి వికెట్‌కు 48 రన్స్ జోడించినా.. స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అయితే.. హర్లీన్ డియోల్ 40 పరుగులతో రాణించగా.. ఆఖర్లో రీచా ఘోష్, స్నేహ్ రానాలు ధనాధన్ ఆడగా ప్రత్యర్థికి 248 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది భారత్. ఛేదనకు దిగిన పాక్ జట్టును వణికిస్తూ యువ పేసర్ క్రాంతి గౌడ్ మూడు వికెట్లతో చెలరేగింది. దీప్తి మూడు, రానా రెండు వికెట్లు తీయగా.. 88 పరుగుల తేడాతో హర్మన్‌ప్రీత్ బృందం దాయాదిని మట్టికరిపించింది.
𝗖𝗹𝘂𝘁𝗰𝗵 𝗥𝗶𝗰𝗵𝗮 𝗚𝗵𝗼𝘀𝗵 – 𝗪𝗵𝗮𝘁 𝗔 𝗞𝗻𝗼𝗰𝗸! 🙌 🙌
9⃣4⃣ Runs
7⃣7⃣ Balls
1⃣1⃣ Fours
4⃣ SixesDrop your reaction in the comments below 🔽 on that stunning innings! 🔥
Updates ▶️ https://t.co/G5LkyPuC6v#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvSA pic.twitter.com/xLdVOEX8In
— BCCI Women (@BCCIWomen) October 9, 2025
ఇక టీమిండియాకు తిరుగులేదు అనుకున్న వేళ.. వైజాగ్‌లో హర్మన్‌ప్రీత్ సేనకు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. రీచా ఘోష్ (94) మెరుపు అర్ధ శతకంతో 251 రన్స్ చేసిన భారత్.. సఫారీలను నిలువరించలేకపోయింది. ప్రధాన పేసర్ క్రాంతి గౌడ్ ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి దెబ్బకొట్టినా.. దక్షిణాఫ్రికా బ్యాటర్లు గొప్పగా ఆడారు. డెత్ ఓవర్లలో బౌలింగ్ లయ తప్పడం.. ఫీల్డింగ్ నాసీరకంగా ఉండడం సఫారీలకు కలిసొచ్చింది.
Right on Target 🎯 Superb yorker 🔥
What a delivery to get a big wicket 👌
Kranti Gaud breaks the partnership as she cleans up the set Laura Wolvaardt 👏
Updates ▶️ https://t.co/G5LkyPuC6v#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvSA pic.twitter.com/kGbFb0z7us
— BCCI Women (@BCCIWomen) October 9, 2025
45వ ఓవర్ వరకూ టీమిండియా వైపు ఉన్న మ్యాచ్‌ను డీక్లెర్క్ సిక్సర్ల మోతతో లాగేసుకుంది. ఆస్ట్రేలియాపై కూడా అంతే.. ఓపెనర్లు మంధాన, ప్రతీకలు తొలిసారి సెంచరీ భాగస్వామ్యంతో శుభారంభమిచ్చినా మిడిలార్డర్ చేతులెత్తేసింది. మళ్లీ రీచా మెరుపులతో 330 రన్స్ చేసిన టీమిండియా విజయంపై భరోసాతో ఉంది. కానీ, ఆసీస్ ఓపెనర్ల దూకుడుకు కళ్లెం వేయలేకపోయారు బౌలర్లు. పవర్ ప్లేలో వికెట్లు తీసి ఒత్తిడి పెంచే క్రాంతి గౌడ్ తేలిపోగా.. అలీసా హీలీ సెంచరీతో చెలరేగింది. ఆఖర్లో అమన్‌జోత్ రెండు వికెట్లు తీసినా.. అలీసా పెర్రీ మెరుపులతో ఆసీస్ గెలుపొందింది.