T20 World Cup 2024 : ఐసీసీ ట్రోఫీ కోసం 11 ఏండ్లుగా నిరీక్షిస్తున్న టీమిండియా (Team India) పొట్టి ప్రపంచకప్‌లో అదరగొడుతోంది. అమెరికా గడ్డపై హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8కు చేరిన రోహిత్ శర్మ (Rohit Sharma) బృందం టైటిల్ వేటలో మరో అడుగు వేసింది. శనివారం(జూన్ 15)న జరిగే నామమాత్రపు పోరులో భారత జట్టు పసికూన కెనడా(Canada)తో తలపడనుంది.
ప్రస్తుతం 6 పాయింట్లతో గ్రూప్ ‘ఏలో టాప్‌లో ఉన్న భారత్.. సూపర్ 8 ఫైట్‌కు ముందు భారీ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మెగా టోర్నీలో రెండో రౌండ్‌కు చేరిన టీమిండియా సెమీస్ బెర్తు కోసం మూడు జట్లను ఢీ కొట్టనుంది. వీటిలో కనీసం రెండు మ్యాచుల్లో గెలిస్తే చాలు.. సెమీస్ బెర్తు దక్కినట్టే.
New York ✅#TeamIndia arrive in Florida 🛬 for their last group-stage match of the #T20WorldCup! 👍 pic.twitter.com/vstsaBbAQx
— BCCI (@BCCI) June 14, 2024
వెస్టిండీస్ వేదికగా జరుగబోయే సూపర్ 8 ఫైట్‌లో భారత్ తొలి ప్రత్యర్ధి ఎవరంటే.. అఫ్గనిస్థాన్ (Afghanistan). టీ20 వరల్డ్ కప్‌లో తొలిసారి సూపర్ 8లో అడుగుపెట్టిన కాబూలీ టీమ్‌ను జూన్ 20న బార్బడోస్‌లో టీమిండియా ఢీ కొట్టనంది. ఆ తర్వాతి మ్యాచ్ జూన్ 24న. నిరుడు రెండు ఐసీసీ ఫైనల్స్‌లో షాకిచ్చిన ఆస్ట్రేలియా (Australia)తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడని ఆసీస్‌కు చెక్ పెట్టాలంటే భారత్ సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ బృందం జయభేరి మోగిస్తే ఈసారి సెమీస్ బెర్తు ఖాయమే.