అఫ్గాన్‌తో వన్డేలకు కోహ్లీ దూరం
టీమిండియా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా అఫ్గానిస్తాన్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ హ్యామ్‌స్ట్రింగ్ (కాలు కండరం) గాయానికి గురయ్యాడు.
న్యూఢిల్లీ: టీమిండియా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా అఫ్గానిస్తాన్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ హ్యామ్‌స్ట్రింగ్ (కాలు కండరం) గాయానికి గురయ్యాడు. దీంతో ఈ నెల13 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ నుంచి అతడు వైదొలిగాడని బీసీసీఐ వర్గాలు గురువారం వెల్లడించాయి.
‘గాయం వల్ల కోహ్లీ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లోనే అతడు గాయపడ్డాడు. స్కానింగ్ రిపోర్టుల్లో మోకాలి కింది భాగంలో ఉండే కండరాల కనెక్టింగ్ టిష్యూ దెబ్బతిన్నట్టు తేలింది’ అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. 37 ఏండ్ల వయసులోనూ తిరుగులేని ఫిట్నెస్తో ఉండే కోహ్లీకి ఇలాంటి అరుదైన గాయం కావడం గమనార్హం. శ్రీలంక్ టూర్‌కు వెళ్లే భారత్-ఏ జట్టుకు ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్‌ను విరాట్ స్థానంలో టీమిండియాలోకి తీసుకునే అవకాశం ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

