మూసీ బాధితుల ఆక్రందన
తుగ్లక్ పాలనపై మూసీ బాధితులు కన్నెర్ర చేశారు. ప్రజలు లేకుండా..ప్రజాభిప్రాయం సేకరించడంపై ఆగ్రహించారు. మూసీ బాధితులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని వాలంతరి కార్యాలయానికి కిస్మత్పూర్ నుంచి బాపుఘాట్ దాకా ఉన్న మూసీ పరీవాహక ప్రాంతంలోని బాధితుల్లో కేవలం 48 మందిని మాత్రమే పిలిచి..
- బాధితులను విభజించి ఆస్తులు కొల్లగొట్టేందుకు కుట్ర
- సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతల అరెస్ట్
- ప్రజలు లేకుండా ప్రజాభిప్రాయం
- గుట్టుచప్పుడు కాకుండా సమావేశం నిర్వహణ
- అందరినీ ఒకేసారి ఎందుకు పిలవలేదని నిలదీత
- ప్రాంగణానికి వెళ్లేందుకు బాధితుల ప్రయత్నం
- ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు
- వాలంతరి వద్ద తీవ్ర ఉద్రిక్తత
- పోలీసుల తీరుపై ఆగ్రహం
తుగ్లక్ పాలనపై మూసీ బాధితులు కన్నెర్ర చేశారు. ప్రజలు లేకుండా..ప్రజాభిప్రాయం సేకరించడంపై ఆగ్రహించారు. మూసీ బాధితులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని వాలంతరి కార్యాలయానికి కిస్మత్పూర్ నుంచి బాపుఘాట్ దాకా ఉన్న మూసీ పరీవాహక ప్రాంతంలోని బాధితుల్లో కేవలం 48 మందిని మాత్రమే పిలిచి.. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అది తెలుసుకున్న మిగతా బాధితులు అక్కడికి చేరుకుని అందరినీ ఎందుకు పిలువడం లేదని నిలదీశారు. సమావేశ ప్రాంగణానికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. కాగా, సుందరీకరణ ప్రాజెక్టు.. తమ జీవితాల్లో చీకట్లు నింపుతోందని బాధితులు ఆవేదన చెందారు. తమ ఆక్రందన వినే వారే లేరా.. అంటూ.. ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో మరింత భయాందోళనలకు గురయ్యారు. బాధితులను మభ్యపెట్టో..విభజించో.. మానసిక వేధింపులకు గురిచేశో.. విలువైన భూములను లాక్కొనేందుకు కుట్రలు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం.. గుట్ట చప్పుడు కాకుండా.. అది కొద్ది మందినే పిలిచి.. వారి అభిప్రాయాలను తీసుకోవడంపై బాధితులు మండిపడుతున్నారు.

సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులను మభ్యపెట్టి, విభజించి విలువైన భూములను లాక్కొనేందుకు కుట్రలు చేస్తున్నది. అందులో భాగంగా మూసీ పరీవాహక ప్రజలను మానసికంగా వేధింపులకు గురిచేసి ఎలాగైనా ప్రజల కలల సౌధాల మీద మూసీ ప్రాజెక్టును నిర్మించాలని చూస్తున్నది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్ కార్పొరేషన్ ఆదిశగా అడుగులు వేస్తున్నది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆస్తులను కోల్పోతున్న వారందరినీ పిలిచి అభిప్రాయ సేకరణ చేయకుండా దశలవారీగా ఒక్కో ప్రాంతం నుంచి కొద్ది మందిని మాత్రమే పిలిస్తున్నారు. వారి అభిప్రాయాలను తీసుకోకుండా కేవలం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ.. పరిహారం, ప్రాజెక్టు డిజైన్లను వివరించి వారితో సంతకాలు చేయించుకుని పంపిస్తున్నారు.
ఈ తతంగమంతా ఏకపక్షంగా జరుగుతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది మందిని పిలిచి అభిప్రాయ సేకరణ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు బుధవారం రాజేంద్రనగర్‌లోని వాలంతరి కార్యాలయానికి కిస్మత్పూర్ నుంచి బాపుఘాట్ దాకా ఉన్న మూసీ పరీవాహక ప్రాంతంలోని బాధితుల్లో కేవలం 48 మందిని మాత్రమే పిలిచి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అది తెలుసుకున్న మిగతా బాధితులు అక్కడికి భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. అందిరినీ పిలవకుండా గుట్టు చప్పుడు కాకుండా నాలుగు గోడల మధ్య.. పోలీసు పహారాలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ఏంటని నిలదీశారు. డీపీఆర్ లేకుండా ఎవరి భూమి ఎంత పోతుందో పూర్తి వివరాలు చెప్పకుండా పరిహారం గురించి ఎలా చర్చిస్తున్నారని నిలదీశారు. దీంతో వందలాదిగా మోహరించిన పోలీసులు వారిని నిలువరించి.. అక్కడి నుంచి పంపించేశారు. దీంతో కాంగ్రెస్ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కాంగ్రెస్ సర్కార్‌పై బాధితుల కన్నెర్ర
మూసీ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణకు కొద్ది మందినే గుట్టుచప్పుడు కాకుండా పిలవడంపై పరీవాహక బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిలిచిన వారిలోనూ కొద్ది మంది అర గంట ఆలస్యంగా వచ్చినా సమావేశం దగ్గరకు పోనీయకుండా అడ్డుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. వాలంతరి ప్రధాన గేటు దగ్గర వందల మంది పోలీసులు మోహరించి.. సమావేశానికి పిలిచిన వారిలో కొద్ది మందిని మాత్రమే లోపలికి అనుమతించడంతో నిరసనకు దిగారు. కిస్మత్పూర్ నుంచి బాపుఘాట్ వరకు పదుల సంఖ్యలో కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, ప్లాట్లు, వ్యవసాయ భూములు మూసీ ప్రాజెక్టుకు ప్రభావితం అవుతుంటే కొద్దిమందినే పిలవడం వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించారు.
బాధితులను రానీయకుండా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసే తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వాళ్లను నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి తోసేశారు. పోలీసులు ప్రభుత్వం తీరుపై మూసీ పరీవాహక బాధితులు విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజల ఆస్తులను లూటీ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే తరహాలో వ్యవహరిస్తే వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
ప్రజల ఆస్తులను దోచుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెడతామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మూసీ ప్రాజెక్టు డీపీఆర్ బయటపెట్టి బహిరంగ మార్కెట్లో ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే మూసీ పరీవాహక ప్రజలంతా జేఏసీగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టేందుకు భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు.
గుట్టుచప్పుడు కాకుండా ప్రజాభిప్రాయ సేకరణా?
- పటోళ్ల కార్తీక్ రెడ్డి, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి

మూసీ సుందరీరకరణ పేరిట కాంగ్రెస్ సర్కార్ ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నది. ప్రజాభిప్రాయ సేకరణ గుట్టుచప్పుడు కాకుండా, నాలుగు గోడల మధ్య చేపడత్తారా? ప్రజలే లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ ఎలా చేస్తారు? అధికారులకు నచ్చినది మాట్లాడుకుని, బాధితులతో సంతకాలు తీసుకుని భూములను లాక్కొనేందుకు కుట్ర చేస్తున్నారు. అసలు మూసీ బాధితులతో సమావేశం దేని గురించి పెట్టారా? టెండర్లు వేయడానికి పెట్టారా? డీపీఆర్ బయటపెట్టడానికి పెట్టారా? అసలు దేనికోసం మీటింగ్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు వచ్చిందని రైతులకు నీళ్లు, కరెంటు ఇవ్వను అంటున్నది. ఇక్కడ అధికారులేమే మూసీ సుందరీకరణ పేరిట ప్రజల ఆస్తులను లాక్కొనేందుకు కుట్ర చేస్తున్నారు. బాధితులకు అండగా ఉండాలని సంఘీభావం తెలిపేందుకు వస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను మాత్రం ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు.? కాంగ్రెస్ ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.
వాలంతరి..కిరికిరి
- మూసీ బాధితుల్లో కొంతమందితోనే అధికారుల భేటీ

బండ్లగూడ,అక్టోబర్ 28: రాజేంద్రనగర్ వాలంతరీలో మూసీ బాధితుల వివరాలు తెలియజేస్తున్నారనే సమాచారంతో బుధవారం బాధితులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. కాగా మూసీ అధికారులు ఈ సమావేశానికి కొంతమందికి మాత్రమే సమాచారం ఇవ్వడంతో మిగిలిన బాధితులు తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని తమను కూడా సమావేశానికి అనుమతించాలని వాలంతరీకి పోటెత్తారు. పోలీసులు వారిని అడ్డుకుని అధికారుల నుంచి ఫోన్ కాల్ వచ్చిన వారిని మాత్రమే లోనికి పంపించి మిగితావారిని గేటుబయటే ఆపేశారు. దీంతో ఇలా రహస్య పద్ధతిలో భూములను లాక్కోవడం ఎంతవరకు సమజసం అని.. తాము భూములు ఇవ్వమని అవసరమైతే కోర్టులను ఆశ్రయిస్తామని వారు తేల్చి చెప్పారు. అయితే పోలీస్ బందో బస్త్ మధ్య సమావేశం ముగిసింది.
అందరికీ న్యాయం చేయలేం
- ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్

మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి మరోసారి స్పష్టమైంది. ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోతున్న ప్రజలకు న్యాయం చేయలేమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ స్పష్టం చేశారు. దీంతో మూసీ బాధితుల పట్ల ప్రభుత్వ తీరును ఆయన బయటపెట్టినైట్లెంది. వాలంతరిలో బుధవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ.. మూసీ ప్రాజెక్టు కింద భూములు, ఇండ్లు, ఆస్తులు కోల్పోతున్న ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని అన్నారు. అదేవిధంగా ఏ ప్రాజెక్టు నిర్మించినా అందిరికీ న్యాయం చేయలేమని, కొంతమందికి అన్యాయం జరుగుతుందని, దానికి ఎవరూ ఏమీ చేయలేరని ఎమ్మల్యే చెప్పడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.
మూసీ సుందరీకరణ పేరిట సర్కార్ ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ప్రజలే లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ ఎలా చేస్తారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులు ఎక్కడికి వెళ్లినా పోలీసులు వెంటపడుతున్నారని, ప్రజా సమస్యల పై స్పందించకుండా నిర్బంధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ పాలనలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని ధ్వజమెత్తారు.
ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు

రేవంత్‌రెడ్డి పాలనలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష నాయకులు ఎక్కడికి వెళ్లినా పోలీసులు వెంటపడుతున్నారు. ప్రజా సమస్యల పై స్పందించకుండా నిర్బంధిస్తున్నారు. మూసీ ప్రాజెక్టు పై ఖర్చు చేయనున్న నిధులను రైతుల సంక్షేమానికి, విద్యుత్ కొనుగోలుకు వినియోగించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యామ్‌లు, ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణలో సాగునీరు, విద్యుత్ సమస్యలు తగ్గి రైతులు సమృద్ధిగా పంటలు పండించారు.
-ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి
కమీషన్లు దండుకునేందుకే మూసీ

ప్రజలు కరువుతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ మూసీ ప్రాజెక్టును ముందుకు తెచ్చారు. గొంతెడుతున్నదని ప్రజలు.. పంటలకు నీరివ్వాలని అన్నదాతలు, పిల్లల చదువులు ఆగిపోయే ప్రమాద మున్నదని ఆదుకోవాలని నిరుపేద తల్లిదండ్రులు సర్కార్ వైపు ఆశగా ఎదురు చూస్తుంటే ప్రభుత్వ పెద్ద మాత్రం మూసీకి రంగులు వేసి కమీషన్లు దండుకునేందుకు యత్నించడం దుర్మార్గం. మూసీ ఫేస్-1 కింద కేటాయించిన రూ. 7,437 కోట్లలో 30 శాతం దోపిడీ చేసేందుకు యత్నిస్తున్నారు. – ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
మూసీకి కాదు..లూటీకి వ్యతిరేకం

మూసీ బ్యూటీఫికేషన్కు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు..ఆ ప్రాజెక్టు ముసుగులో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న లూటీకి మాత్రమే. మూసీ పేరిట రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపింది. డీపీఆర్ లేకుండానే ఆగమేఘాలపై టెండర్లు పిలవడంలో ఆంతర్యమేంటి..? 50 మీటర్ల బఫర్ జోన్‌ను 500 మీటర్లకు పెంచడంలోని మతలబెంటీ..? వెంటనే డీపీఆర్ బహిర్గతం చేసి ప్రజలకు వాస్తవాలు వివరించాలి. అధికారం ఉన్నదని నిరంకుశంగా ముందుకెళ్తే బీఆర్ఎస్ సహించబోదు.
– ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
గుట్టుగా ప్రజాభిప్రాయ సేకరణా?

Karthik Reddy
మూసీ సుందరీరకరణ పేరిట కాంగ్రెస్ సర్కార్ ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నది. ప్రజాభిప్రాయ సేకరణ గుట్టుచప్పుడు కాకుండా, నాలుగు గోడల మధ్య చేపడత్తారా?..అధికారులకు నచ్చినది మాట్లాడుకుని, బాధితులతో సంతకాలు తీసుకుని భూములను లాక్కొనేందుకు కుట్ర చేస్తున్నారు. అసలు మూసీ బాధితులతో సమావేశం దేని గురించి పెట్టారా? టెండర్లు వేయడానికి పెట్టారా? డీపీఆర్ బయటపెట్టడానికి పెట్టారా? అసలు దేనికోసం మీటింగ్ పెట్టారు.
-రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి పటోళ్ల కార్తిక్‌రెడ్డి
అందరికీ న్యాయం చేయలేం

T Prakash Goud
మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోతున్న ప్రజలకు న్యాయం చేయలేం. మూసీ ప్రాజెక్టు కింద భూములు, ఇండ్లు, ఆస్తులు కోల్పోతున్న ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తాం. అదేవిధంగా ఏ ప్రాజెక్టు నిర్మించినా అందరికీ న్యాయం చేయలేం. కొంతమందికి అన్యాయం జరుగుతున్నది. దానికి ఎవరూ ఏమీ చేయలేరు.
– ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్
ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన
తెలంగాణలో సాగుతున్నది ఇందిరమ్మ ప్రజా పాలన కాదు.. రేవంత్‌రెడ్డి రాక్షసపాలన. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలన ఎప్పుడు పోతే అప్పుడు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారు. ప్రజల ఆస్తులను వాళ్లు అడిగినంత ధరకు ఇవ్వకుంటే జీరో వ్యాల్యూ చేస్తామని అంటున్న రేవంత్‌రెడ్డిదే జీరో వ్యాల్యూ. మా కష్టార్జితాన్ని మాకు తెలియకుండా, మమ్మల్ని అడగకుండా ఎలా గుంజుకుంటారు. ప్రజల అభిప్రాయాలు తీసుకుని భూములకు మార్కెట్ ధర చెల్లిస్తామంటే మూసీ ప్రాజెక్టుకు సహకరిస్తాం. లేదంటే ఇండ్ల దగ్గరకు రాకుండా అడ్డుకుంటాం.
– మాధవి, మూసీ బాధితురాలు
మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధిచెబుతాం
ప్రజలను ఇబ్బందులకు గురి చేసి విలువైన భూములను లాక్కొంటున్న రేవంత్‌రెడ్డికి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తాం. హెచ్ఎండీఏ లేఅవుట్ ద్వారా కొనుగోలు చేసిన భూములను భూసేకరణ చేపట్టిన ఈ ప్రభుత్వానికి కొంచమైనా బుద్ధి ఉన్నదా? రేవంత్‌రెడ్డి చేస్తున్నది మూసీ సుందరీకరణ కాదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. మూసీ చుట్టుపక్కల ఉన్న భూములను లాక్కొని మాల్స్, హోటళ్లు కట్టి వ్యాపారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మూసీలోకి ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్స్ రాకుండా అడ్డుకోవడం చేతకాదు కానీ ఇక్కడ మా విలువైన భూములు లాక్కుని సుందరీకరణ చేస్తామంటున్నారు. మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి కండ్లు తెరవాలి. లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు.
– సుజన్ కుమార్, మూసీ బాధితుడు
అందరి అభిప్రాయం తీసుకోవాలి
మూసీ బాధితులతో మూసీ రివర్ప్రెంట్ అధికారులు నిర్వహించిన సమావేశానికి కొంతమందినే లోనికి ఎలా అనుమతిస్తారు. భూములు అందరివి లాక్కుంటామని తెలిపిన అధికారులు అందిరికి తెలిసేలా సమావేశం ఏర్పాటు చేయాలి.కొంత మంది బాధితులతో చర్చిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది. అందిరి అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి.
– సావిత్రీదేవి, మూసీ బాధితురాలు
ప్రభుత్వం విభజించి పాలిస్తున్నది
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విభజించి పాలించే ప్రయత్న చేస్తుంది. అందరికీ ఒకేసారి సమాచారం ఇవ్వకుండనే.. ఒక్కొక్కరిని ఒప్పించాలనే ప్రయత్నాలు చేస్తుందే తప్ప నిజమైన బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదు. మూసీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి డీపీఆర్ లేకపోవడం విచారాకరం.
– వైశాలి, మూసీ బాధితురాలు
ఇల్ల్లు లాక్కుంటే ఎక్కడ పోయి బతకాలి?
నా భర్త నేవీలో పనిచేసి దేశ సేవ చేశారు. ఆయనకు ఇప్పుడు 75 ఏళ్లు. మూసీ పేరిట ప్రభుత్వం ఇప్పుడు మా ఇల్లు తీసుకుంటామని బెదిరిస్తే మేం ఎక్కడ పోయి బతకాలి. వాలంతరీలో సమావేశం జరుగుతుందని తెలిసి మాకు న్యం జరుగుతుందని ఆశతో వచ్చాం. అయితే మమల్ని పోలీసులు లోనికి పోనివ్వలేదు.
– సరస్వతి, మూసీ బాధితురాలు


Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

