స్పెయిన్‌లో రెండు హైస్పీడ్ రైళ్ల ఢీ
సెంట్రల్ స్పెయిన్‌లో బుధవారం వేగంగా దూసుకొచ్చిన ఒక రైలు ఆగి ఉన్న మరో రైలు వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టడంతో రెండు బోగీలు పట్టాలు తప్పగా, 68 మంది మరణించారని అధికారులు తెలిపారు. కాస్టిల్లా లా మాంచా ప్రాంతానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయం మృతుల సంఖ్య పెరిగిందని ధ్రువీకరించింది.
- 68 మంది మృతి, 179 మందికి గాయాలు
ఉర్దా(స్పెయిన్), అక్టోబర్ 28: సెంట్రల్ స్పెయిన్‌లో బుధవారం వేగంగా దూసుకొచ్చిన ఒక రైలు ఆగి ఉన్న మరో రైలు వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టడంతో రెండు బోగీలు పట్టాలు తప్పగా, 68 మంది మరణించారని అధికారులు తెలిపారు. కాస్టిల్లా లా మాంచా ప్రాంతానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయం మృతుల సంఖ్య పెరిగిందని ధ్రువీకరించింది. అక్కడి ప్రాంతీయ అధ్యక్షుడు ఎమిలియానో గార్సియా-పేజ్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో కనీసం 179 గాయపడ్డారని, శిథిలాల మధ్య చిక్కుకుపోయిన లేదా మరణించిన వారి కోసం గాలింపు చర్యలను సహాయక సిబ్బంది కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది స్పెయిన్‌లో జరిగిన రెండవ పెద్ద రైలు ప్రమాదం ఇది. టోలెడో ప్రావిన్సులో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని స్పెయిన్ రైల్వే వ్యవస్థ నిర్వాహక సంస్థ ఏడీఐఎప్ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

