ముల్లాన్‌పూర్: అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు భారత స్టార్ క్రికెటర్లు రోహిత్‌శర్మ, హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ పరీక్షలో పాసయ్యారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో ఫిట్నెస్ సమస్యల కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ఈ ఇద్దరికి బెంగళూరులోని సీవోఈ నుంచి క్లియరెన్స్ లభించింది. వెన్నునొప్పితో ఇబ్బందిపడుతున్న ఆల్‌రౌండర్ హార్దిక్..గత కొన్ని రోజులు గా సీవోఈలో పలు పరీక్షలు ఎదుర్కొన్నాడు.
స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌ల సమక్షంలో హార్దిక్ 10 ఓవర్ల పాటు ఎలాంటి సమస్య లేకుండా బౌలింగ్ చేసినట్లు సీవోఈ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు కండరాల గాయం నుంచి హిట్‌మ్యాన్ పూర్తిగా కోలుకున్నట్లు తెలిపాయి. దీంతో ఈ ఇద్దరు ఈనెల 15 నుంచి ధర్మశాల వేదికగా అఫ్గాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నారు.