BCCI : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (2025-27)ను ఘనంగా ఆరంభించిన భారత జట్టు ఇక స్వదేశంలో సత్తా చాటనుంది. ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సమం చేసిన టీమిండియా.. అక్టోబర్‌లో వెస్టిండీస్(West Indies)తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. దాంతో.. స్క్వాడ్ ఎంపికపై బీసీసీఐ, సెలెక్టర్లు కసరత్తు ప్రారంభించారు. ఆన్లైన్ సమావేశం నిర్వహించి.. సెప్టెంబర్ 23, 24వ తేదీల్లో ఆటగాళ్ల పేర్లను ప్రకటిస్తామని సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించాడు.
‘సొంతగడ్డపై భారత జట్టు త్వరలోనే వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఆటగాళ్ల సెలక్షన్ కోసం ఆటగాళ్ల సెలక్షన్ కోసం సెప్టెంబర్ 23 లేదా 24న ఆన్లైన్ మీటింగ్ ఆన్లైన్ మీటింగ్ నిర్వహిస్తాం. అనంతరం అదే రోజు స్క్వాడ్‌ను ప్రకటిస్తాం’ అని సైకియా తెలిపాడు. మరో వారంలో జరుగబోయే బీసీసీఐ కొత్త కార్యవర్గం ఎన్నికల్లో సైకియా మరోసారి కార్యదర్శి పదవికి నామినేషన్ వేశాడు.
#WATCH | Mumbai: BCCI Secretary Devajit Saikia says, “Till now, I have filed my nomination for secretary. People are submitting nominations for all posts. The process is going on. The deadline to file a nomination is 4 pm…Till now, 7-8 have already submitted…I have filed my… pic.twitter.com/InlXHHl0gC
— ANI (@ANI) September 21, 2025
ప్రస్తుతం డబ్ల్యూటీసీలో పట్టికలో మూడో స్థానంలో ఉన్న భారత్.. ముందంజ వేయాలంటే వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేయాలి. అందుకే.. పటిష్టమైన స్క్వాడ్‌ను ఎంపిక చేయడంపైనే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గంభీర్ దృష్టి సారిస్తున్నారు. అయితే.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన బృందంలోని పలువురు ఈ సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశముంది. గాయం నుంచి కోలుకుంటున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్, వరుసగా రెండు టెస్టు సిరీస్‌లకు దూరమైన సీనియర్ పేసర్ షమీ స్క్వాడ్‌లో ఉంటారా? లేదా? అనేది తెలియదు. భారత్, విండీస్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా అక్టోబర్ 2న తొలి టెస్టు జరుగనుంది. అక్టోబర్ 10 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో రెండో టెస్టు షురూ కానుంది.