ముంబై: వచ్చే నెల 2 నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ఈనెల 23 లేదా 24న ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తెలిపాడు.
అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ ఆన్లైన్లో సమావేశమై జట్టును ప్రకటిస్తుందని సైకియా చెప్పాడు. అక్టోబర్ 2 నుంచి అహ్మదాబాద్‌లో తొలి టెస్టు, 10 నుంచి ఢిల్లీలో రెండు టెస్టు జరుగుతుంది.