ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC Rankings) తాజా ర్యాంకులను రిలీజ్ చేసింది. వన్డేలు, టీ20ల్లో ఇండియా టాప్ ప్లేస్ కొట్టేసింది. ఇక టెస్టు ఫార్మాట్లో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా, ఇండియా నాలుగో స్థానానికి పడిపోయింది. పురుషుల క్రికెట్‌కు చెందిన వార్షిక ర్యాంకింగ్స్‌ను సోమవారం ఐసీసీ రిలీజ్ చేసింది. 2024 మే నుంచి ఆడిన మ్యాచ్‌ల ఆధారంగా ర్యాంకులను వెల్లడించారు.
టెస్టుల్లో ఆస్ట్రేలియా లీడింగ్‌లో ఉన్నది. టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆ జట్టు టాప్ ప్లేస్ లో ఉంది. వార్షిక పాయింట్లు 15 నుంచి 13కు తగ్గినా.. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా 126 పాయింట్లతో అగ్రస్తానంలో నిలిచింది. బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇండ్లండ్ జట్టు రెండో స్థానానికి ఎగబాకింది. సౌతాఫ్రికా, ఇండియాను ఆ టీమ్ వెనక్కినెట్టింది. ఈ ఏడాది ఆడిన 4 టెస్టుల్లో ఇండ్లండ్ మూడింటిలో విజయం సాధించింది. ఇంగ్లండ్ రేటింగ్ పాయింట్లు 113 కాగా, దక్షిణాఫ్రికా 111, ఇండియా 105 పాయింట్లతో మూడవ, నాలుగవ స్థానాల్లో ఉన్నాయి.
వన్డే ర్యాంకుల్లో ఇండియా అగ్రస్థానంలో ఉన్నది. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకున్నది. రేటింగ్‌ను 122 నుంచి 124కు పెంచింది. చాంపియన్స్ ట్రోఫీ రన్నరప్ న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉన్నది. ఇక ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. టీ20ల్లో ఇండియానే వరల్డ్ చాంపియన్. ప్రస్తుతం మన జట్టు టాప్‌లో ఉన్నది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కన్నా 9 పాయింట్లు ఆధిక్యంలో భారత్ ఉన్నది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు ఆ తర్వాత ర్యాంకుల్లో ఉన్నాయి.
From Test dominance to ODI and T20I brilliance, the updated ICC Men’s Team Rankings showcase outstanding cricketing feats 🤩 https://t.co/IVTyPOyLyE
— ICC (@ICC) May 5, 2025