ముంబై: టీమ్ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్‌శర్మ రానున్న ఆస్ట్రేలియా పర్యటన కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఫిట్నెస్ పరీక్షలో పాసైన హిట్‌మ్యాన్ తాజాగా బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో బిజీగా గడిపాడు. శుక్రవారం ముంబైలో రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చాడు. నెట్ బౌలర్ల సహాయంతో చాలాసేపు బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్‌మీడియాలో విరివిగా కనిపించాయి. ‘ఇక్కడికి మళ్లీ వచ్చా ను. ఇదేంతో బాగా అనిపిస్తున్నది’ అని వీడియోలో రోహిత్ అన్న మాటలు వైరల్‌గా మారాయి. టీ20, టెస్టులకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ముంబైకర్ వన్డేల్లో కొనసాగుతున్నాడు.