న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు స్పాన్సర్ల జెర్సీ లేని షర్ట్లతోనే ఆసియాకప్లో ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్(Jjersey Sponsors)ను మరో రెండు లేదా మూడు వారాల్లోగా ఫైనలైజ్ చేయనున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. జెర్సీ స్పాన్సర్లకు చెందిన బిడ్స్ షెడ్యూల్ సెప్టెంబర్ 16వ తేదీన ముగియనున్నది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చింది. ఆన్లైన్ గేమింగ్ బిల్లుతో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీని వల్ల ఆన్లైన్ గేమింగ్ కంపెనీ డ్రీమ్ 11 టీమిండియా స్పాన్సర్షిప్ నుంచి తప్పుకున్నది. దీంతో ప్రతి ఏడాది 358 కోట్ల స్పాన్సర్షిప్ను బీసీసీఐ కోల్పోయినట్లు అయ్యింది.