Champions Trophy 2025 | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గరపడింది. ఐసీసీ ఈవెంట్ బుధవారం నుంచి మొదలుకానున్నది. హైబ్రిడ్ మోడల్లో పాకిస్తాన్, దుబాయిలో జరుగనున్నాయి. భారత జట్టు అన్ని మ్యాచులన్నీ దుబాయిలోనే ఆడనున్నది. 50 ఓవర్ల టోర్నీలో భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు బరిలోకి దిగబోతున్నాయి. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ గ్రూప్-ఏలో ఉన్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు గ్రూప్-బీలో ఉన్నాయి.
టీమిండియా ఈ మెగా ఈవెంట్లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నది. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్లతో పాటు భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నది. బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్‌లో టీమిండియా బలంగానే ఉంది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా సొంత మైదానంలో ఇంగ్లాండ్ 3-0 తేడాతో ఓడించి.. ప్రత్యర్థులకు టైటిల్ ఫేవరేట్ రేసులో ఉన్నామని సంకేతాలు పంపింది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేయగా.. విరాట్ సైతం టచ్‌లోకి వచ్చాడు. యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన లయలో ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్ మిడిలార్డర్లో టీమిండియా బలంగానే ఉంది.
బౌలింగ్‌లో రవీంద్ర జడేజా, కుల్దీప్, అక్షర్, వరుణ్ చక్రవర్తితో భారత స్పిన్ విభాగం బలంగా కనిపిస్తోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పాటు, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, భారతదేశం గ్రూప్-ఏలో ఉన్నాయి. భారత్ రెండుసార్లు చాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. చివరిసారిగా 2013లో ఇంగ్లాండ్‌తో చాంపియన్స్ ట్రోఫీని గెలించింది. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా విజేతగా నిలిచింది. గత రెండు సార్లు ఫైనల్స్‌కు చేరిన టీమిండియా భారత జట్టు విజయశాతం 69.2శాతంగా ఉన్నది. ఇప్పటి వరకు 29 మ్యాచులు ఆడి.. 19 మ్యాచులు గెలిచింది.
ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం ఖచ్చితంగా టీమిండియాకు పెద్ద లోటుగా మారింది. ఇటీవల కాలంలో మూడు ఫార్మాట్లలో టీమిండియాకు బుమ్రాకు మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. బుమ్రా గైర్హాజరీలో మహమ్మద్ షమీ జట్టులో సీనియర్ ఫాస్ట్ బౌలర్ టీమిండియా బౌలింగ్ భారాన్ని మోయనున్నాడు. గాయం కారణంగా చాలారోజుల పాటు టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఇక వరుణ్ చక్రవర్తి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. మిస్టరీ స్పిన్నర్ ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుతమైన రాణించాడు. దాంతో భారత జట్టు వన్డేలో చోటు సంపాదించాడు. గత సంవత్సరం ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మినహాయించి.. ఇటీవల సంవత్సరాల్లో భారత ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో తడబడింది. ఈ సారి ఫైనల్‌కు అర్హత సాధిస్తే మాత్రం చరిత్రకు భిన్నంగా టైటిల్‌ను సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.