Arshdeep Singh | టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 2024 సంవత్సరానికి గాను ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు. గతేడాది యూఎస్, వెస్టిండిస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అర్ష్‌దీప్ అద్భుతంగా రాణించాడు. భారత్ జట్టు ప్రపంచకప్ గెలువడంలో కీలక పాత్ర పోషించాడు. అర్ష్‌దీప్ ఇటీవల టీ20ల్లో టీమిండియా విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. గతేడాది టీ20 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అర్ష్‌దీప్ 36 వికెట్ల పడగొట్టాడు. 2024లో ఈ ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాతో కలిసి ఐసీసీ బెస్ట్ టీ20 ఇంటర్నేషన్ టీమ్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్, ఆస్ట్రేలియా సంచలన బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్, జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజాను పక్కన నెట్టి అర్ష్‌దీప్ ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు.
Congratulations to Arshdeep Singh for being voted the ICC Men’s T20I Cricketer of the Year 2024.
May you keep winning more awards and wish you another year filled with lots of success 👏🙌#TeamIndia | @arshdeepsinghh pic.twitter.com/n8KG1QLyLJ
— BCCI (@BCCI) January 25, 2025
టెస్టులు ఆడే దేశాల్లో గతేడాది టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి బాబర్ నిలిచాడు. 23 ఇన్నింగ్స్‌లో 33.54 సగటు, 133.21 స్ట్రయిక్ రేట్‌తో 738 పరుగులు చేశాడు. ఇందులో ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. దాంతో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులో నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ సైతం ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు. 2024లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా హెడ్ నిలిచాడు. 15 ఇన్నింగ్స్‌లో 38.50 సగటు, 178.47 స్ట్రయిక్ రేట్‌తో నాలుగు అర్ధ సెంచరీలు సహా 539 పరుగులు చేశాడు. అలాగే జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా సైతం అవార్డుకు నామినేట్ అయ్యాడు. గతేడాది టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా సికిందర్ నిలిచాడు. 23 ఇన్నింగ్స్‌లో 28.65 సగటు, 146.54 స్ట్రయిక్ రేట్‌తో 573 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలున్నాయి. గతేడాది 23 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టడు. బెస్ట్ బౌలింగ్ గణాంకాల విషయానికి వస్తే కేవలం 18 పరుగులు ఇచ్చి ఐదు వికెట్ల తీశాడు.
From a star-studded list of four, the ICC Men’s T20I Cricketer of the Year 2024 has been crowned 👑
Find out the winner ➡️ https://t.co/HDWo0YSSG9 pic.twitter.com/LK6AKRqias
— ICC (@ICC) January 25, 2025
ఇదిలా ఉండగా.. ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన అర్ష్‌దీప్ ఐసీసీతో మాట్లాడారు. తన క్రికెట్ ప్రయాణంలో 2024 టీ20 ప్రపంచకప్ గెలువడం మరపురాణి క్షణాలని తెలిపాడు. ఐసీసీ మెన్స్ బెస్ట్ టీ20 ప్లేయర్ అవార్డుకు ఎంపికైనందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తనకు ప్రత్యేక క్షణమని.. జట్టు కోసం తన వంతు కృషి చేసి మంచి ఫలితం వచ్చేలా చేయాలనుకున్నట్లు వివరించాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన అర్ష్‌దీప్‌కు బీసీసీఐ శుభాకాంక్షలు చెప్పింది.
Australian Open | ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత మాడిసన్ కీస్.. ఫైనల్లో ఓడిన టాప్ సీడ్ సబలెంక
T20 Team Of The Year | 2024 బెస్ట్ టీ20 టీమ్‌ని ప్రకటించిన ఐసీసీ.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ..!