T20 Team Of The Year | అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) 2024 సంవత్సరానికి టీ20 బెస్ట్ టీమ్‌ను శనివారం ప్రకటించింది. అత్యుత్తమ జట్టులో నలుగురు భారతీయ ఆటగాళ్లకు చోటు దక్కింది. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన ప్లేయర్స్‌లో నుంచి ఇద్దరు ఈ జాబితాలో ఉన్నారు. జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేసింది. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీ20 ఇంటర్నేషనల్ నుంచి రోహిత్, విరాట్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక వుమెన్స్ జట్టులో ముగ్గురు భారత ప్లేయర్‌కు చోటు దక్కింది. స్మృతి మంధాన, రిచా ఘోష్, దీప్తి శర్మ బెస్ట్ టీమ్‌లో ఐసీసీ చోటు కల్పించింది. అత్యధికంగా భారత జట్టు నుంచి ముగ్గురు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరికి చోటు దక్కగా.. జట్టు కెప్టెన్సీగా సౌతాఫ్రికా ప్లేయర్ ఎల్ వోల్వార్డ్‌ను ఎంపిక చేసింది.
భారత్ నుంచి నలుగురు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, జింబాబ్వే నుంచి ఒక్కొక్కరు ఎంపికయ్యారు. భారత్ నుంచి రోహిత్‌తో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు. జట్టులో ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్, ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్, వెస్టిండీస్‌కు చెందిన నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన రషీద్ ఖాన్, శ్రీలంకకు చెందిన వనిందు హసరంగా, జింబాబ్వేకు ప్లేయర్ సికందర్ చోటు దక్కించుకున్నారు. గతేడాది ప్రపంచకప్‌లో తొలిరౌండ్లోనే ఇంటిముఖం పట్టిన పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ సైతం టీ20 బెస్ట్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోవడం విశేషం.
రోహిత్ శర్మ 2024లో 11 మ్యాచ్‌లలో 42 సగటుతో మరియు 160.16 స్ట్రయిక్ రేట్‌తో 378 పరుగులు చేశాడు. ఇందులో 121 పరుగులు బెస్ట్ స్కోర్. ఒకే ఒక్క సెంచరీ సాధించాడు. అదే సమయంలో ఆల్ రౌండర్ హార్దిక్ గతేడాది 17 మ్యాచుల్లో 352 పరుగులు చేసి 16 వికెట్లు పడగొట్టాడు. 50 పరుగులు అత్యుత్తమ స్కోర్ కాగా.. 20 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు.
భారత్ టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా గతేడాది ఎనిమిది టీ20 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ఏడు పరుగులకు మూడు వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సైతం బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 18 మ్యాచ్‌లు ఆడి 13.50 సగటుతో 36 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన తొమ్మిది పరుగులకు నాలుగు వికెట్లు.
రోహిత్ శర్మ (కెప్టెన్-భారత్), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్), బాబర్ అజామ్ (పాకిస్థాన్), నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సికందర్ రజా (జింబాబ్వే), హార్దిక్ పాండ్యా (భారత్), రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్), వనిందు హసరంగా (శ్రీలంక), జస్ప్రీత్ బుమ్రా (భారత్), అర్ష్‌దీప్ సింగ్ (భారత్).
ఎల్ వోల్వార్డ్ (కెప్టెన్-దక్షిణాఫ్రికా), మారిజాన్ కాప్ (దక్షిణాఫ్రికా), స్మృతి మంధాన (భారత్), రిచా ఘోష్ (వికెట్ కీపర్-భారతదేశం), దీప్తి శర్మ (భారత్), చమరి అటపట్టు (శ్రీలంక), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), నాట్ సెవార్డ్ బ్రంట్ (ఇంగ్లాండ్), మెల్లీ కర్ (ఆస్ట్రేలియా), ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (ఐర్లాండ్), సాడియా ఇక్బాల్ (పాకిస్థాన్).
Ranji Trophy: రంజీలో ముంబైకి షాక్.. జమ్మూకశ్మీర్ స్టన్నింగ్ విక్టరీ
Applauding all the superstars who made the ICC Women’s T20I Team of the Year for 2024 👏 pic.twitter.com/cPYHRH9cko
— ICC (@ICC) January 25, 2025