Noman Ali: చరిత్ర సృష్టించిన పాకిస్థాన్ స్నిన్నర్.. విండీస్‌పై హ్యాట్రిక్ తీసిన నోమన్ అలీ.. వీడియో
Noman Ali: పాక్ స్పిన్నర్ నోమన్ అలీ హ్యాట్రిక్ తీశాడు. విండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. పాకిస్థాన్ టెస్టు క్రికెట్లో.. హ్యాట్రిక్ తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు క్రియేట్ చేశారు.
ముల్తాన్: పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ(Noman Ali) చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో హ్యాట్రిక్ వికెట్లు తీసుకున్న తొలి పాక్ స్పిన్నర్‌గా నిలిచాడు. ఇవాళ ముల్తాన్‌లో వెస్టిండీస్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో అతను హ్యాట్రిక్ తీసుకున్నాడు. విండీస్ బ్యాటర్లు జస్టిన్ గ్రీవ్స్, టెవిన్ ఇమ్లాచ్, కెవిన్ సింక్లెయిర్ ను అతను వరుసగా బంతుల్లో ఔట్ చేశాడు. 1952 నుంచి పాకిస్థాన్ టెస్టు క్రికెట్ ఆడుతున్నది. అయితే టెస్టుల్లో పాక్ స్పిన్నర్ హ్యాట్రిక్ తీయడం ఇదే మొదటిసారి.
𝐎𝐧𝐞 𝐢𝐧𝐜𝐫𝐞𝐝𝐢𝐛𝐥𝐞 𝐟𝐞𝐚𝐭! 😍
Hat-trick hero Noman Ali makes history in Multan 🙌#PAKvWI | #RedBallRumble pic.twitter.com/2xRLeYpVXl
— Pakistan Cricket (@TheRealPCB) January 25, 2025
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓ దశలో కేవలం 38 రన్స్‌కే ఆ జట్టు ఏడు వికెట్లును కోల్పోయింది. పాకిస్థాన్ తరపున టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన బౌలర్లలో వసీం అక్రమ్, అబ్దుల్ రజాక్, మహమ్మద్ సమీ, నసీమ్ షా ఉన్నారు. వసీం రెండు సార్లు శ్రీలంకపైనే హ్యాట్రిక్ తీసుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం..వెస్టిండీస్ 41.1 ఓవర్లలో 163 రన్స్‌కు ఆలౌటైంది. నోమన్ అలీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మొత్తం ఆరు వికెట్లు తీసుకున్నాడు. మోతే 55 రన్స్ చేసి ఔటవ్వగా, వారికన్ 36 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
Noman Ali joins an exclusive club ✨
The first spinner and 5️⃣th bowler from Pakistan to achieve a Test hat-trick 🇵🇰🏅#PAKvWI | #RedBallRumble pic.twitter.com/ok4XX9r1Px
— Pakistan Cricket (@TheRealPCB) January 25, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

