ముంబై: డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు.. రంజీ టోర్నీ(Ranji Trophy) గ్రూపు ఏ మ్యాచ్‌లో .. జమ్మూకశ్మీర్ చేతిలో ఓటమి పాలైంది. 5 వికెట్ల తేడాతో జమ్మూకశ్మీర్ జట్టు విజయం నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 205 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన జమ్మూకశ్మీర్ ఓ దశలో 159 రన్స్‌కే అయిదు వికెట్లు కోల్పోయింది. కానీ ఆరో వికెట్‌కు అబిద్ ముస్తాక్, కన్హయ్య వద్వాన్ అజేయంగా 46 రన్స్ జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ముంబై బౌలర్ షామ్స్ ములానీ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
వాస్తవానికి ఈ రంజీ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పేలవ ఫామ్ ప్రదర్శించిన రోహిత్.. దేశవాళీ క్రికెట్లో ఆడాల్సి వచ్చింది. అయితే జమ్మూకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను విఫలం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో 28 రన్స్ మాత్రమే చేశాడు. యుధిర్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అతను ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కీలకమైన 20 రన్స్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై బ్యాటర్ శార్దూల్ ఠాకూర్ 119 రన్స్ చేసి ఔటయ్యాడు.
రంజీ ట్రోఫీ గ్రూపు సీ మ్యాచ్‌లో.. కర్నాటక చేతిలో పంజాబ్ ఓడిపోయింది. ఇన్నింగ్స్ 207 తేడాతో ఓటమి చవిచూసింది. పంజాబీ బ్యాటర్ శుభమన్ గిల్ సెంచరీ చేసినా తమ జట్టును గెలిపించలేకపోయాడు. పంజాబ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 55, రెండో ఇన్నింగ్స్‌లో 213 రన్స్ చేసింది. కర్నాటక తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 475 రన్స్ చేసింది. రవిచంద్రన్ స్మరన్ 203 రన్స్ చేశాడు.