INDW vs NPLW : మహిళల ఆసియా కప్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత జట్టు (Team India) సెమీస్‌లో అడుగుపెట్టింది. వరసగా మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించిన టీమిండియా టైటిల్‌కు రెండడుగల దూరంలో నిలిచింది. మంగళవారం నేపాల్‌పై 82 పరుగుల తేడాతో భారత్ జయభేరి మోగించింది. మొదట షఫాలీ వర్మ(82) విధ్వంసానికి జడుసుకున్న ప్రత్యర్థిని ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(3/13) స్పిన్ ఉచ్చులో పడేసింది. దాంతో నేపాల్ నిర్ణీత ఓవర్లలో 96 పరుగులకే పరిమితమైంది. ఆడిన మూడు మ్యాచుల్లో జయకేతనం ఎగురవేసిన టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది.
డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా మహిళల ఆసియా కప్‌లో అజేయంగా దూసుకెళ్తోంది. తొలి పోరులో పాకిస్థాన్‌ను.. ఆపై యూఏఈని చిత్తు చేసిన భారత జట్టు గళవారం నేపాల్‌ను వణికించింది. భారీ ఛేదనలో నేపాల్‌కు అరుంధతి రెడ్డి ఆదిలోనే షాకిచ్చింది. తనమొదటి ఓవర్లోనే ఓపెనర్ సంజనా ఖడ్కా(7)ను బౌల్డ్ చేసి నేపాల్‌ను ఒత్తిడిలో పడేసింది.
Team India’s unbeaten run continues as they book their semi-final spot with a thumping win 🇮🇳#WomensAsiaCup2024 #ACC #HerStory #INDWvNEPW pic.twitter.com/yzTXSUNDsE
— AsianCricketCouncil (@ACCMedia1) July 23, 2024
ఆ తర్వాత ధాటిగా ఆడుతున్న సితా రనా మగర్(18)ను సైతం బౌల్డ్ చేసింది. ఆ తర్వాత కెప్టెన్ ఇందు బర్మ(14), రుబినా ఛెత్రీ(15)లు ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ, దీప్తి శర్మ, రాధా యాదవ్‌లు ఈ ఇద్దరిని వెనక్కి పంపడంతో నేపాల్ కోలుకోలేక పోయింది.
𝙄𝙣𝙩𝙤 𝙩𝙝𝙚 𝙎𝙚𝙢𝙞𝙨!#TeamIndia continue their winning run in #WomensAsiaCup2024 👏👏
Scorecard ▶️ https://t.co/PeRykFLdTV#ACC | #INDvNEP pic.twitter.com/8Eg77qAJOt
— BCCI Women (@BCCIWomen) July 23, 2024
దంబుల్లా స్టేడియంలో టాస్ గెలిచిన కెప్టెన్ స్మృతి మంధానా బ్యాటింగ్ తీసుకుంది. గత మ్యాచ్‌లో యూఏఈపై దంచేసిన డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ(82) నేపాల్ బౌలర్లను ఉతికేసింది. మెరుపు అర్ధ శతకంతో జట్టుకు అదిరే ఆరంభాన్నిచ్చింది.
ఆమెకు దయలాన్ హేమలత(47) చక్కని సహకారం అందించింది. దాంతో ఇద్దరూ తొలి వికెట్‌కు 122 రన్స్ జోడించారు. ఆ తర్వాత వచ్చిన సంజన(10) విఫలమైనా.. జెమీమా రోడ్రిగ్స్(28 నాటౌట్) ధనాధన్ ఆడి జట్టు స్కోర్ 170 దాటించింది. దాంతో, భారత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.