Asia Cup : పదిహేడో సీజన్ ఆసియా కప్ (Asia Cup) టోర్నమెంట్‌కు సమయం దగ్గరపడుతోంది. టైటిల్ ఫేవరెట్ అయిన భారత జట్టు పటిష్టమైన స్క్వాడ్‌తో ఈ మెగా క్రీడా సమరంలో పోటీపడనుంది. ఈ టోర్నీ కోసం టీమిండియా బృందం వచ్చే వారం దుబాయ్‌కు బయల్దేరనుంది. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) నేతృత్యంలోని మన సైన్యం సెప్టెంబర్ 4న అక్కడికి చేరుకోనుంది. అయితే.. బృందంలోని 15 మంది ఒక్కసారిగా కాకుండా బ్యాచ్‌లుగా వెళ్తారని సమాచారం.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ మొదలవ్వనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత జట్టు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు నాలుగైదు రోజుల ముందే అక్కడికి చేరుకోనుంది. దుబాయ్‌లో సెప్టెంబర్ 4న క్రికెటర్లు అంతా ఒక్కచోట చేరుతారు.
Team India players will travel to the UAE from their respective locations instead of leaving together from Mumbai.
Source: PTI#AsiaCup2025 #HardikPandya #SuryakumarYadav #IndianCricketTeam #CricketTwitter pic.twitter.com/sSuV9ga6Fl
— InsideSport (@InsideSportIND) August 28, 2025
‘సెప్టెంబర్ 4 సాయంత్రం కల్లా స్క్వాడ్‌లోని ఆటగాళ్లందరూ దుబాయ్ చేరుకుంటారు. అక్కడి ఐసీసీ అకాడమీలో మరుసటి రోజే నెట్ సెషన్లో పాల్గొంటుంది టీమిండియా. లగేజీ, కిట్‌తో ప్రయాణించాల్సి వస్తుంది కాబట్టి ఆటగాళ్ల సౌకర్యార్థం వాళ్లు తమతమ పట్టణాల నుంచే నేరుగా దుబాయ్‌కు వచ్చేస్తారు’ అని బీసీసీఐలోని సీనియర్ అధికారి పీటీఐ (PTI) వార్తా సంస్థతో వెల్లడించాడు.
🚨 A look at #TeamIndia‘s squad for #AsiaCup 2025 🔽 pic.twitter.com/3VppXYQ5SO
— BCCI (@BCCI) August 19, 2025
ఆసియా కప్ స్క్వాడ్‌లోని కొందరు దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు. యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా నార్త్ జోన్‌కు, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సెంట్రల్ జోన్ తరఫున బరిలోకి దిగారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ముగియగానే వీళ్లు కూడా సెప్టెంబర్ 4న దుబాయ్ చేరుకుంటారు. ఆసియా కప్ లీగ్ దశలో సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో భారత జట్టు తలపడనుంది. అనంతరం 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొననుంది సూర్యకుమార్ సేన. సూపర్ ఫోర్కు ముందు జరుగబోయే చివరి లీగ్ మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో టీమిండియా ఆడనుంది.
ఆసియా కప్ స్క్వాడ్ : సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.