ఢిల్లీ: టీమ్ఇండియా హెడ్‌కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతం గంభీర్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఐఎస్ఐఎస్ కశ్మీర్ అనే అనుమానాస్పద ఐడీ నుంచి ‘ఐ కిల్ యూ’ అని రెండు ఈ-మెయిల్స్ వచ్చినట్టు గంభీర్.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈనెల 22న పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి నేపథ్యంలో సోషల్ మీడియాలో గంభీర్ చేసిన పోస్ట్ అనంతరం ఈ మెయిల్స్ వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. గంభీర్‌కు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. 2022లోనూ అతడికి ఇలాంటి మెయిల్సే వచ్చాయి. బెదిరింపులతో గంభీర్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.