Ravindra Jadeja : భారత జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఇన్నాళ్లూ టీమిండియా తరఫున ఇరగదీసన జడ్డూ ఇక రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్జీయే కూటమిలోని భారతీయ జనతా పార్టీ (BJP)లో జడేజా చేరాడు. ఈ విషయాన్ని ఆయన భార్య రివబ జడేజా (Rivaba Jadeja) సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
గురువారం తన భర్త కాషాయ పార్టీ సభ్యత్వం తీసుకున్న ఫొటోను రివబ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దాంతో, క్షణాల్లో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. అభిమానులు జడేజా రాజకీయ అరంగేట్రంపై జోరుగా చర్చించుకుంటున్నారు. ఆల్‌రౌండర్‌గా బ్యాటుతో, బంతితో తన ముద్ర వేసిన జడేజా ఇక రాజకీయ మైదానంలో ఏ మేరకు ప్రభావం చూపిస్తాడు? అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుందని మరికొందరు అనుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతానికి బీజేపీ సభ్యత్వం తీసుకున్న జడేజా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాడా? అనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.
🪷 #SadasyataAbhiyaan2024 pic.twitter.com/he0QhsimNK
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) September 2, 2024
ఈమధ్యే టీ20 వరల్డ్ కప్ గెలుపొందిన భారత జట్టులో సభ్యుడైన జడేజా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. వరల్డ్ కప్‌లో పెద్దగా రాణించనందున శ్రీలంక పర్యటనకు అతడిని సెలెక్టర్లు పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే. జడ్డూకు ప్రత్నామ్నాయంగా ఎంపికైన అక్షర్ పటేల్ (Axar Patel) ఆల్‌రౌండర్‌గా మెప్పించాడు.
దాంతో, ఇకపై జడ్డూ టెస్టులకే పరిమితం అవుతాడా? అనే ప్రశ్నలు జోరందుకున్నాయి. కానీ, దులీప్ ట్రోఫీ(Duleep Trophy)కి ముందు గాయపడిన జడేజా నేరుగా బంగ్లాదేశ్‌తో రెండు సిరీస్‌లో బరిలోకి దిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో అతడి భార్య రివబ.. జడేజా రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ పెట్టిన పోస్ట్ అందరినీ ఒకింత షాక్‌కు గురి చేసింది.